
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 45


అనసూయ కొత్త డైలాగ్

క్రెడిట్ అంతా తారక్ అన్నదే - సత్యదేవ్

చిరంజీవి లేటెస్ట్ లుక్

"కిరాతక "మూవీ అప్ డేట్

సల్మాన్ ఖాన్ పై పూజాహెగ్డే ప్రశంసలు

మరో బాలీవుడ్ రీమేక్ మూవీ లో బెల్లంకొండ ?

రష్మిక లేటెస్ట్ శారీ లుక్

రెండు మూవీస్ కు కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్

సోషల్ మీడియా లో నాని హవా

సీతకు ప్రభాస్ బర్త్ డే శుభాకాంక్షలు

టైమ్ ట్రావెల్ మూవీ లో శర్వానంద్ ?

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్, నాగ్

ఎంతో సంతోషంగా ఉన్నా - ప్రగ్య జైస్వాల్

'గల్లీ రౌడీ' సెన్సార్ పూర్తి

హారర్ థ్రిల్లర్ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కాజల్ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

అనసూయ కొత్త డైలాగ్
యాంకర్ గా బిజీగా ఉన్న స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం సుమంత్ యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.

క్రెడిట్ అంతా తారక్ అన్నదే - సత్యదేవ్
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ “బ్లఫ్ మాస్టర్” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సత్యదేవ్ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “ , "గాడ్సే " , "స్కైలాబ్ "మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “రామ్ సేతు”హిందీ మూవీలో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.. "లూసిఫర్ "తెలుగు రీమేక్ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం.

చిరంజీవి లేటెస్ట్ లుక్
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "ఆచార్య "మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. హీరో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. "ఆచార్య "మూవీ తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ కై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ మూవీ ఆగస్ట్ 12 వ తేదీ నుండి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మూవీ కై ఒక భారీ సెట్ రూపొందుతుంది.

"కిరాతక "మూవీ అప్ డేట్
విజన్ సినిమాస్ బ్యానర్ పై ఎమ్ వీరభద్రం దర్శకత్వంలో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా క్రైమ్ థ్రిల్లర్ “కిరాతక” మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 వ తేదీ ప్రారంభం కానుంది. పూర్ణ, దాసరి అరుణ్‌కుమార్, దేవ్‌గిల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ మూవీ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. “కిరాతక “ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

సల్మాన్ ఖాన్ పై పూజాహెగ్డే ప్రశంసలు
స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో జంటగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న పూజాహెగ్డే , రణ్ వీర్ హీరోగా రూపొందుతున్న "సర్కస్ "హిందీ మూవీ లోకథానాయికగా నటిస్తున్నారు.

మరో బాలీవుడ్ రీమేక్ మూవీ లో బెల్లంకొండ ?
ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “అల్లుడు శీను ” మూవీ తో టాలీవుడ్ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఆమూవీ లో తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో బెల్లంకొండ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జయ జానకి నాయక “, “రాక్షసుడు “, “అల్లుడు అదుర్స్ ” వంటి మూవీస్ తో బెల్లంకొండ ప్రేక్షకులను అలరించారు. హిందీ డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈయన హిందీ డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. హిందీ డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్న బెల్లంకొండ బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

రష్మిక లేటెస్ట్ శారీ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, శాండిల వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 4 మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. అల్లు అర్జున్ “పుష్ప “, శర్వానంద్ “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” (తెలుగు ), సిద్ధార్ధ్ మల్హోత్రా "మిషన్ మజ్ను ", అమితాబ్ బచ్చన్ "గుడ్ బై "(హిందీ ) మూవీస్ షూటింగ్స్ లో రష్మిక బిజీగా ఉన్నారు.

రెండు మూవీస్ కు కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో కృతి శెట్టిటాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కృతిశెట్టి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్”, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ , రామ్ పోతినేని”#RAPO 19 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ‘శ్యామ్ సింగరాయ్” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

సోషల్ మీడియా లో నాని హవా
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ షూటింగ్ ను హీరో నాని కంప్లీట్ చేశారు. సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు. “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'మహా సముద్రం' మోషన్ పోస్టర్ రిలీజ్
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మహాసముద్రం'. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుదల చేసిన శర్వానంద్, సిద్దార్ధ్, అదితిరావు హైదరి, అనూ ఇమాన్యూయేల్, జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు అన్నింటిని…

హీరో ధనుష్ , శేఖర్ కమ్ముల మూవీ కి స్క్రిప్ట్ రెడీ
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బాలీవుడ్ లో రెండు మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ధనుష్ నటించిన "అత్రాంగి రే "మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో ధనుష్ ప్రస్తుతం "మారన్ "తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ కి హీరో ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ తో ధనుష్ టాలీవుడ్ కు పరిచయం కానున్నారు.

సీతకు ప్రభాస్ బర్త్ డే శుభాకాంక్షలు
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

టైమ్ ట్రావెల్ మూవీ లో శర్వానంద్ ?
సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "మహాసముద్రం "మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. శర్వానంద్ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు , తమిళ భాషలలో "ఒకే ఒక జీవితం ", శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై "ఆడవాళ్ళు మీకు జోహార్లు " మూవీస్ తెరకెక్కుతున్నాయి. హీరో శర్వానంద్ ప్రస్తుతం "ఆడవాళ్ళు మీకు జోహార్లు " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు ఒక టైమ్ ట్రావెల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్, నాగ్
రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించగా ఇప్పటివరకూ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్ చేస్తూ.. వారు కూడా మొక్కలు నాటేలా చేస్తూ..అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.

భారీ సాంగ్ తో "#RC15" షూటింగ్ ప్రారంభం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “,కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్ "భారతీయుడు ", "జీన్స్ ", "ఒకే ఒక్కడు ", అపరిచితుడు ", "శివాజి ", "రోబో ", "2. 0" వంటి డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన శంకర్ ఎస్ దర్శకత్వంలో "#RC15" మూవీ కి హీరో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఎంతో సంతోషంగా ఉన్నా - ప్రగ్య జైస్వాల్
తెలుగు ,తమిళ భాషల "విరాట్టు "మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు.

'గల్లీ రౌడీ' సెన్సార్ పూర్తి
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. ఈసినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అంతేకాదు ఆగష్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.

"చోర్ బజార్ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
"గబ్బర్ సింగ్ ", "బుజ్జిగాడు ", "చిరుత "వంటి పలు మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్ పూరి "ఆంధ్రాపోరి "మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. "మెహబూబా "మూవీ తో ఆకాష్ ప్రేక్షకులను అలరించారు. ఆకాష్ కధానాయకుడిగా రూపొందిన"రొమాంటిక్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆకాష్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ "చోర్ బజార్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.