అభిమానులు కాలర్ ఎగరేసేలా “హరిహర వీర మల్లు “

Sai Madhav Promises A Treat For Pawan Kalyan Fans In Hari Hara Veera Mallu Movie,Hari Hara Veeramallu Is A Next Level Movie Sai Madhav,Hari Hara Veeramallu Movie Updates,Hari Hara Veera Mallu Is A Next Level Movie Says,Sai Madhav,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Update,Hari Hara Veera Mallu Movie update,Hari Hara Veera Mallu Movie Latest Update,Hari Hara Veera Mallu Movie Latest News,Update On Pawan Kalyan Krish Movie,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie,Krish,Director Krish,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Shooting,Pawan Kalyan Hari Hara Veera Mallu Update,Krish,Krish Movies,Krish New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan PSPK27 Movie,PSPK27,PSPK27 Update,PSPK27 Movie Updates,Pawan Kalyan Latest Movie News,Sai Madhav,Sai Madhav Latest News,Sai Madhav About Hari Hara Veera Mallu Movie,#HariHaraVeeraMallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ మూవీ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం లో “PSPK 28 ” మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్యద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతుంది. నిధి అగర్వాల్ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. “హరిహరవీరమల్లు “మూవీ గురించి డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ “హరి హర వీరమల్లు నెక్స్ట్ లెవెల్ మూవీ అనీ , దీనికి అద్భుతమైన కథ ఉందనీ , ఈ చిత్రం విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు తమ కాలర్‌ను పైకి ఎగరేస్తారనీ , గర్వంతో వారి చేతులను తమ హృదయాలపై ఉంచవచ్చనీ , . ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాననీ చెప్పారు. “హరిహరవీరమల్లు ” మూవీ 2022 సంవత్సరం సంక్రాంతికి తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =