సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా నటిస్తున్న ఈ మూవీ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శాకుంతలం ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ , ఢీ , పటాస్ ఫేమ్ బుల్లితెర యాంకర్ వర్షిణి “శాకుంతలం ” మూవీలో ఒక కీలక పాత్రకై ఎంపిక అయ్యారు. వర్షిణి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. సక్సెస్ ఫుల్ “శంభో శివ శంభో “మూవీ తో అతిథి పాత్రలో నటనకు శ్రీకారం చుట్టిన వర్షిణి సౌందర్రాజన్ కొన్ని మూవీస్ లో నటించారు. ఇప్పుడు వర్షిణి “శాకుంతలం ” మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. పాన్ ఇండియా మూవీ “శాకుంతలం ” లో స్టార్ హీరోయిన్ సమంత తో స్క్రీన్ షేర్ చేసుకొనడంతో వర్షిణి సంతోషంగా ఉన్నారు.“శాకుంతలం ” మూవీ తెలుగు, తమిళ, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: