వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “ది ఘోస్ట్” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా కాజల్ అగర్వాల్ ఎంపిక అయ్యారు. ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ అగర్వాల్ ఈ మూవీ నుండి వైదొలగడంతో హీరో నాగార్జున కు జోడీగా సోనాల్ చౌహాన్ ఎంపిక అయ్యారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. “ది ఘోస్ట్” మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుంది. పదిహేను రోజులు జరిగే షూటింగ్ షెడ్యూల్ లో నాగార్జున, సోనాల్ చౌహాన్ పాల్గొంటారు. థాయ్‌లాండ్‌కు చెందిన స్టంట్ డైరెక్టర్ నుంగ్ నేతృత్వంలో దుబాయ్‌లో మూడు భారీ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. సూపర్ హిట్ “బంగార్రాజు” మూవీ తరువాత నాగార్జున నటిస్తున్న “ది ఘోస్ట్ “మూవీ ని ఈ ఏడాది విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
![Video thumbnail](https://img.youtube.com/vi/dfIZX-_DCaQ/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/MQttzA3fOPw/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/XnHdCpYDUrE/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/w2b482LkS_U/default.jpg)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)