మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప :ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ ను గోల్డ్ మైన్స్ సంస్థ నార్త్ లో రిలీజ్ చేసింది. బాలీవుడ్ లో స్ట్రయిట్ మూవీస్ ను క్రాస్ చేసి భారీ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. హీరో అల్లు అర్జున్ , రష్మిక ల పెర్ఫార్మెన్స్ , సాంగ్స్ బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























