రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కానీ చెప్పిన డేట్ కే సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పలు పోస్టర్లు.. పాటలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో అర్జున్ మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈసినిమాలో అర్జున్ పాత్రకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అర్జున్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ను బట్టి ఏఎస్ అర్జున్ భరద్వాజ్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: