కరోనా థర్డ్ వేవ్ వచ్చి పెద్ద సినిమా రిలీజ్ కు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. లేకపోతే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యేవి. కానీ తెలిసిందే కదా. కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం.. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూసేయడంతో పెద్ద సినిమాల రిలీజ్ లను వాయిదా వేశారు. ఇక తాజాాగా ఈసినిమాల రిలీజ్ లపై దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాకు తెలిసి ఫిబ్రవరి నెలాఖరు నుంచి పెద్ద సినిమాల రిలీజ్ లు మొదలైపోతాయి. అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి పరిస్థితులన్నీ నార్మల్ అవుతాయి కాబట్టి పెద్ద సినిమాలన్నీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను అనుకోవడం ఫిబ్రవరి 25 నుంచి మార్చి, ఏప్రిల్, మే వరకు అన్ని పెద్ద సినిమాలు వచ్చేస్తాయి. సమ్మర్ లోపు పెద్ద సినిమాల రౌండ్ పూర్తయిపోతుంది. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు.. అందరం మాట్లాడుకునే ఒక డెసిషన్ కు వస్తాం.. పెద్ద సినిమాలు వస్తే వేరే సినిమాల రిలీజ్ లు మార్చుకోవాల్సిందే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా రెండు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంది.. మార్చిలో కనుక రిలీజ్ కాకపోతే.. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. నేను ఎఫ్3 సినిమాను ఏప్రిల్ 28న ఫిక్స్ చేసుకున్నా.. ఆర్ఆర్ఆర్ కనుక ఏప్రిల్ 28న వస్తే నేను ఎఫ్ 3 రిలీజ్ డేట్ మార్చుకోవాల్సిందే.. ఇవన్నీఅండర్ స్టాండింగ్ మీద జరుగుతుంటాయి అని క్లారిటీ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: