“హమ్ నౌజవాన్ “(1985 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన టబు “కూలీ నెం . 1 “మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “కాదల్ దేశం”మూవీ తో తమిళ , “కాలాపానీ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు టబు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ హిందీ, తమిళ, మలయాళ , ఇంగ్లీష్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . అజిత్ హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “కండుకొండెన్ కండుకొండెన్ “తమిళ మూవీ లో కథానాయికగా నటించిన టబు 22 సంవత్సరాల తరువాత “#THALA 61″మూవీ లో అజిత్ కు జోడీగా నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన “నెర్కొండ పార్వై “తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన “వాలిమై” తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అదే కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీ “#THALA61″తమిళ మూవీలో అజిత్ కు జంటగా టబు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: