శివ కార్తికేయన్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అక్కడి హీరోలకు మంచి పోటీ ఇస్తూ విభిన్నమైన కథలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే డాక్టర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శివ కార్తికేయన్. ఆ సినిమాను తానే నిర్మించి మంచి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది డాక్టర్ సినిమా. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడిప్పుడే మూసిన థియేటర్లు కూడా మళ్లీ తెరుస్తున్నారు. ఆక్యూపెన్నీ పెంచుతున్నారు. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. మార్చి 25న ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
See you in theatres 😊👍 #DONfromMarch25 #DON pic.twitter.com/qhjrtJkRe3
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 31, 2022
కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. డాక్టర్ తరువాత శివకార్తికేయన్ తో ప్రియాంక చేస్తున్న రెండో సినిమా ఇది. ఇంకా ఈసినిమాలో ఎస్.జే సూర్య, సముద్రఖని, సూరి, మునికాంత్, కాళి వెంకట్, బాలా శరవణన్, శివాంగి తదితరులు నటిస్తున్నారు. శివ కార్తికేయ ప్రొడక్షన్స్ మరియు లైకా ప్రొడక్షన్స్ కలిసి ఈసినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: