టాలీవుడ్ యంగ్ హీరోల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ప్రస్తుతం విశ్వక్ సేన్ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా కూడా ఒకటి. విద్యాసాగర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ఈసినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్ కుమార్‌గా అలరించనున్నాడు విశ్వక్. ప్రస్తుతం ఆయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు.. అలాగే ఒక పాటను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఫిబ్రవరి 2వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Get ready for the bombastic celebration of @arjunkumarallam with #AVAKteaser 🎊😍
TEASER Releasing on Feb 2nd! ❤️#AshokaVanamLoArjunaKalyanam@VishwakSenActor @RuksharDhillon @BvsnP @storytellerkola#BapineeduB @sudheer_ed @vidya7sagar @jaymkrish @SVCCDigital @SonyMusicSouth pic.twitter.com/shQAGqjCLa
— Vishwak Sen (@VishwakSenActor) January 31, 2022
కాగా ఏబీసీడీ, కృష్ణార్జునయుద్ధం సినిమాల్లో అలరించిన రుక్సార్ దిల్లాన్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: