ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమా పుష్ప హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తున్నాం. సుకుమార్ దర్శకత్వంలో రా అండ్ కల్ట్ సినిమాగా తెరకెక్కగా అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ మాత్రం ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక పుష్ప పాటలు సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో ఊపేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి మొదటిపాన్ ఇండియా పుష్ప సక్సెస్‌ను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా బన్నీ దుబాయ్ ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలు కూడా అయ్యాయి. అయితే దాదాపు రెండు వారాలు అక్కడ ఉన్న బన్నీ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇక ఇంటికి వచ్చిన బన్నీకి అర్హ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఫ్లోర్ పై పూలతో వేల్ కమ్ నాన్న అంటూ బన్నీకి స్వీట్ వెల్ కమ్ చెప్పింది. ఇక ఈ విషయాన్ని బన్నీ తన ఇన్ట్సా ద్వారా తెలియచేయగా.. ప్రస్తుతం ఈ ఫొటో కూడా వైరలు అవుతుంది.
View this post on Instagram
కాగా త్వరలోనే బన్నీ పుష్ప 2 షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు తన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే పనిలో ఉన్నాడు. వేణు శ్రీరామ్ తో ఐకాన్ లైన్ లో ఉంది. కొరటాల శివ తో సినిమాపై ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఏ సినిమా స్టార్ట్ చేస్తాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: