అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఈ చిత్రంతో అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ గా ఎఫ్3 సినిమా వస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల ఎన్ని బ్రేకులు పడ్డాయో తెలిసిందే. లేకపోతే ఈసంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫైనల్ గా తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది.. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది.. వస్తే, కొద్దిగా ముందుగా.. వెళ్ళినా కొద్దిగా వెనకగా కానీ థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా అంటూ క్లారిటీ ఇచ్చారు.
మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది.
మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!😉వస్తే, కొద్దిగా ముందుగా.
వెళ్ళినా కొద్దిగా వెనకగా!😊థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!😎#F3Movie @VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @Mee_Sunil @ThisIsDSP @SVC_official @f3_movie#F3OnApril28th pic.twitter.com/CHjtB5Ry5S
— Sri Venkateswara Creations (@SVC_official) January 29, 2022
కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈసినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మరి చెప్పిన డేట్ కే రిలీజ్ అవుతుందా..? లేక మళ్లీ రిలీజ్ డేట్ ఏమైనా మార్తుస్తారా అన్నది చూడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: