యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా మహాన్.
విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నాడు. ఇక తండ్రీకొడుకులిద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితులు బాలేకపోవడంతో ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈసందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నేడు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ ఆసక్తికరంగా ఉండి సినిమాపై అంచనాలు పెంచుతుంది. మద్యపాన నిషేదం కోసం పోరాడిన ఫ్యామిలీ నుండి వచ్చిన విక్రమ్ అదే మద్యం సిండికేట్‌ని శాసించే వ్యక్తిగా చూపించారు. ధృవ్ ఈసినిమాలో దాదా గా కనిపించనున్నట్లు అర్థమవుతుంది. సిమ్రాన్, బాబి సింహా పాత్రలు సినిమాకు హైలెట్ అని తెలుస్తుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌లో హైలెట్ అయ్యాయి.
Just #ChiyaanVikram livin’ the Mahaan life
Watch #MahaanOnPrime, Feb 10@Karthiksubbaraj @7Screenstudio #SSLalitKumar #DhruvVikram @simranbaggaOffc @Actorsimha #Sananth @ActorMuthukumar @rdeepakparamesh @Music_Santhosh @Kshreyaas @vivekharshan pic.twitter.com/PlQqfJgU8T
— amazon prime video IN (@PrimeVideoIN) January 31, 2022
కాగా ఈసినిమాలో వాణి భోజన్, సిమ్రాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాబీ సింహా, సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేస్తుండగా.. కన్నడలో మహా పురుష పేరుతో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: