ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 220
పవన్ కళ్యాణ్ కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్?
స్టూడెంట్ లీడర్ పాత్రలో సాయి తేజ్

విజువల్ ట్రీట్ #Prabhas 20 - పూజాహెగ్డే
రామ్‌తో మారుతి ఫ్యామిలీ డ్రామా?

విజయనిర్మల ‘కలెక్టర్ విజయ’కు 32 ఏళ్ళు
"ఉప్పెన "మూవీ లో విజయ్ సేతుపతి ఇంటెన్స్ లుక్
మల్టీ స్టారర్ మూవీ లో బాలకృష్ణ ?
రామ్ చరణ్... వరుసగా మూడోసారి?
ప్రభాస్ మూవీ కోసం భారీ హాస్పిటల్ సెట్?
అల్లు అర్జున్ మెగా ఈవెంట్ క్యాన్సిల్..!
ఆ ఒక్క మాట పాయల్ ను మార్చేసింది...!
పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?
అవును నేను బన్నీ గొడవపడ్డాం..!
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో #Prabhas 20
'పవన్' తో 'ప్రభాస్' హీరోయిన్..!

బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను...!
రిలాక్సింగ్ మూడ్ లో మహేష్ బాబు
నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా
కార్తికేయ 2 సీక్వెల్ కాదు..!
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభించనున్నారు.
పవన్ కళ్యాణ్ కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్?
సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందనున్న విషయం తెలిసిందే. "సాహో" మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎంపిక అయినట్టు సమాచారం.
స్టూడెంట్ లీడర్ పాత్రలో సాయి తేజ్
భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ "ప్రస్థానం" మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక పొలిటికల్ డ్రామా రూపొందనున్న విషయం తెలిసిందే. నేటి విద్యావిధానం లో లోటుపాట్లు నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ లో సాయితేజ్ స్టూడెంట్ లీడర్ గా నటించనున్నారు. ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రకై ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ ఎంపిక అయ్యారు.

విజువల్ ట్రీట్ #Prabhas 20 - పూజాహెగ్డే
"జిల్ " మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ లవ్ స్టోరీ "#Prabhas 20" మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇంకొక షూటింగ్ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
రామ్‌తో మారుతి ఫ్యామిలీ డ్రామా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్’తో బిజీగా ఉన్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఏప్రిల్ 9న విడుదల కావలసి ఉండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... రామ్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.

విజయనిర్మల ‘కలెక్టర్ విజయ’కు 32 ఏళ్ళు
దిగ్గజ నటీమణి, మహిళా దర్శకురాలు విజయనిర్మల తెరకెక్కించిన పలు కుటుంబ కథా చిత్రాలు మహిళా లోకం నీరాజనాలు అందుకోవడమే కాకుండా... బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అటువంటి వాటిలో ‘కలెక్టర్ విజయ’ ఒకటి. విజయనిర్మల ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మురళీమోహన్, నరేష్, రమ్యకృష్ణ, గుమ్మడి, కోట శ్రీనివాసరావు, సుధాకర్, త్యాగరాజు, సుత్తివేలు, అన్నపూర్ణ, ముచ్చర్ల అరుణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
"ఉప్పెన "మూవీ లో విజయ్ సేతుపతి ఇంటెన్స్ లుక్
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో "ఉప్పెన"మూవీ రూపొందిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తమిళ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మల్టీ స్టారర్ మూవీ లో బాలకృష్ణ ?
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ల "F2", వేంకటేష్ , నాగచైతన్య "వెంకీ మామ" మల్టీస్టారర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. నాని, సుధీర్ బాబు నటించిన మల్టీ స్టారర్ మూవీ "V" విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ "రౌద్రం రణం రుధిరం " మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టారర్ మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు.
రామ్ చరణ్... వరుసగా మూడోసారి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్... తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఒకే బ్యానర్ లో వరుస చిత్రాలు చేస్తున్నాడా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో. ఆ వివరాల్లోకి వెళితే... తనతో `బ్రూస్ లీ`(2015) చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషన్ లో రీసెంట్ గా చరణ్ `వినయ విధేయ రామ`(2019) చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాజమౌళి డైరెక్టోరియల్ `ఆర్ ఆర్ ఆర్` (రౌద్రం రణం రుధిరం) కూడా డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్నదే.
పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ మాస్ ఎంటర్ టైనర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `గబ్బర్ సింగ్` (2012) ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్... అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. కట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ తరువాత ఈ ద్వయం మరోమారు జట్టుకట్టనున్నారు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఈ సంవత్సరం చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
ప్రభాస్ మూవీ కోసం భారీ హాస్పిటల్ సెట్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రాధే శ్యామ్’, `ఓ డియర్` అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ యాక్ట్రస్ భాగ్యశ్రీ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే... ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ గెటప్స్ కి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
అల్లు అర్జున్ మెగా ఈవెంట్ క్యాన్సిల్..!
కరోనా వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. రిలీజ్ లు ఆగిపోయాయి. ఇక హీరోలు కూడా తమ ప్రోగ్రామ్స్ ను క్యాన్సిల్ చేసుకొని ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు మెగా ఈవెంట్ ను క్యాన్సిల్ చేసాడు. బన్నీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు అయిపోయిన నేపథ్యంలో ఒక మెగా ఈవెంట్ ను నిర్వహించాలనుకున్నారు. కానీ కరోనా వల్ల సీన్ రివర్స్ అయింది. ఈ బిగ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.
ఆ ఒక్క మాట పాయల్ ను మార్చేసింది...!
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఇక ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 2కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట చేసింది. ఐతే ఇంత పెద్ద హిట్టయిన సినిమాలో నటించడానికి హీరోయిన్స్ ఎవరూ ముందుకు రాలేదంటా. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా తెలిపారు.
పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?
మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇక తన తరువాత సినిమా వెంకీ ఉన్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి.
అవును నేను బన్నీ గొడవపడ్డాం..!
అవును నేను-బన్నీ కొట్టుకున్నాం అని అంటున్నాడు అల్లు శిరీష్. అవునా నిజంగానే శిరీష్-బన్నీ గొడవపడ్డారా అని ఆలోచనలో పడ్డారా..? అయితే అదంతా నిజంకాదులెండి.. అసలు ఈ గొడవ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం అసలు కథలోకి వెళ్లాల్సిందే. అసలు సంగతేంటంటే... సోషల్ మీడియా లో ఒక అభిమాని.. అన్నా నువ్వు, బన్నీ ఎప్పుడైనా గొడపపడ్డారా అని అడుగగా.. దానికి శిరీష్ అవును చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆడుతున్నప్పుడు కొట్టుకున్నాం... బాగానే తగిలాయి నాకు కానీ ఆ రివెంజ్ క్రికెట్ లో తీర్చుకున్నా అని చెప్పాడు.. మరో అభిమాని ట్విట్టర్ కి వచ్చేయి అన్నా.. బోలెడంత కాలక్షేపం అని అనగా.. ఒకప్పుడు వచ్చేవాడిని ఫన్ కోసం.. కానీ ఫ్యాన్స్…
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో #Prabhas 20
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ టైనర్ "#Prabhas 20" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న " #Prabhas 20" మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
'పవన్' తో 'ప్రభాస్' హీరోయిన్..!
క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇదిలాఉండగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నట్టు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా జాక్వెలిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమాలో బాలీవుడ్…

బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను...!
మళ్లీ ఎన్టీఆర్ పాత్రను చేయనని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. అసలు సంగతేంటంటే...ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్ కథానాయకుడు', ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో తన తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ.. సినిమా మాత్రం అనుకున్నంత విజయం దక్కించుకోలేకపోయింది అని చెప్పొచ్చు. దీనితో బాలకృష్ణ కాస్త నిరాశపడ్డారట. అందుకే మరోసారి ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి నో చెప్పారట.
రిలాక్సింగ్ మూడ్ లో మహేష్ బాబు
మనకున్న మూవీ సూపర్ స్టార్స్ లో కూలెస్ట్ పర్సన్ మహేష్ బాబు అని చెప్పడంలో సందేహం లేదు. మామూలుగానే కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. రిలాక్స్ మూడ్ లో పైజామా ధరించి సోఫా లో కూర్చుని చిరు నవ్వులు చిందిస్తున్న మహేష్ బాబు ఫోటో ను ఆయన సతీమణి నమ్రత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా
'తేనె మనసులు' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి... సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకున్నారు కృష్ణ. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 1965 మార్చి 31న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేటితో ఈ సినిమా 55 వసంతాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. ఫస్ట్ 70 ఎమ్ఎమ్, ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్, ఫస్ట్ కౌబాయ్ ఇలా అన్నింటి సూపర్ స్టార్ పేరే ఉంటుంది. మొదటి కౌబాయ్, మొదటి జేమ్స్ బాండ్ సినిమా ఇలా ఏ కొత్త ప్రయోగం చేయాలన్నా సూపర్ స్టార్ కృష్ణ తర్వాతే.