ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 221
వెంకటేష్ ‘గురు’కు మూడేళ్ళు

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?
యన్టీఆర్‌తో జాన్వీ కపూర్?
బయోపిక్ మూవీ లో సమంత ?
అల్లు అర్జున్ పై దిశా పటాని ప్రశంసలు

కరోనా కట్టడి కై హీరో నితిన్ సందేశం

లాక్ డౌన్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మెసేజ్

నాగార్జున ‘శ్రీరామదాసు’కు 14 ఏళ్ళు

మరోసారి అజిత్ ద్విపాత్రాభినయం?

రామ్ చరణ్‌తో అనిల్ రావిపూడి?

రామ్ చరణ్ ‘రంగస్థలం’కు రెండేళ్ళు

సినీ కార్మికుల కోసం చిరు ప్రత్యేక చారిటీ

'లాక్ డౌన్' అయినా ఆగని నిఖిల్ '18 పేజీస్'

వర్క్ ఫ్రమ్ హోమ్ అంత ఈజీ కాదు
కోలీవుడ్ లో పూజాహెగ్డే రీ ఎంట్రీ ?
కోలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయ చిత్రం "ముగమూడి" 2012 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవవిజయం సాధించినది. ఆ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం " మూవీ తో టాలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయం అయ్యారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన DJ, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం "Prabhas 20 ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ తొలి చిత్రం ‘తేనెమనసులు’కు 55 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగునాట పలు ప్రయోగాలకు చిరునామాగా నిలచిన లెజెండరీ యాక్టర్. అలాంటి కృష్ణ వెండితెరపై తొలిసారి వెలుగులు పంచిన చిత్రం `తేనెమనసులు`.
వెంకటేష్ ‘గురు’కు మూడేళ్ళు
రీమేక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన తెలుగు కథానాయకుల్లో `విక్టరీ` వెంకటేష్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి పలు రీమేక్ మూవీస్‌లో నటించడమే కాకుండా... సింహభాగం ఘనవిజయాలు అందుకున్నారాయన. అలా విజయం సాధించిన వెంకీ రీమేక్ మూవీస్ లో ‘గురు’ ఒకటి. బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ దర్శనమిచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రితికా సింగ్ బాక్సర్‌గా నటించింది. నాజర్, తనికెళ్ళ భరణి, ముంతాజ్ సర్కార్, రఘుబాబు, జాకీర్ హుస్సేన్, అనంత్ బాబు, సంచనా నటరాజన్, అనితా చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు.

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?
`పటాస్` నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత అనిల్ చేయబోయే సినిమా ఏంటో ఇంకా క్లారిటీ రాలేదు. `ఎఫ్ 2` సీక్వెల్ చేయబోతున్నాడంటూ ఒకవైపు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ పక్కా అంటూ మరోవైపు కథనాలు వస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే... నటసింహ బాలకృష్ణతో అనిల్ నెక్స్ట్ వెంచర్ ఉంటుందని టాక్.
యన్టీఆర్‌తో జాన్వీ కపూర్?
`అరవింద సమేత` వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం విదితమే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
బయోపిక్ మూవీ లో సమంత ?
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఒక బయోపిక్ మూవీ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటిక్ సింగర్, యాక్టి విస్ట్ , స్కాలర్ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ ని రూపొందించనున్నారు. నాగరత్నమ్మ క్యారెక్టర్ కు సూటబుల్ యాక్ట్రెస్ కై సింగీతం ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అనుష్కను సంప్రదించగా డేట్స్ ప్రాబ్లెమ్ తో సెట్ కాలేదు. రీసెంట్ గా ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత ను సంప్రదించగా స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అల్లు అర్జున్ పై దిశా పటాని ప్రశంసలు
కరోనా వైరస్ నివారణ కై ప్రధాని మోదీ 21రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొంతమంది సెలబ్రిటీస్ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది వర్క్ అవుట్స్, కుకింగ్, గేమ్స్, రీడింగ్, టీవీ చూస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్నారు.

కరోనా కట్టడి కై హీరో నితిన్ సందేశం
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ భారత్ లో కూడా ప్రభావం చూపుతుండటంతో ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ కట్టడికై కేంద్ర, తెలుగు రాష్ట్రాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్ నివారణ కై ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా హీరో నితిన్ ప్రజలకు, తన అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు.

లాక్ డౌన్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మెసేజ్
కరోనా మహమ్మారి కారణంగా ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొంత మంది పరిస్థితులను అర్థం చేసుకోకుండా బయట తిరుగుతున్నారు. దానికి పర్యవసానం ప్రజలందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రతీ ఒక్కరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని పూరి జగన్నాథ్ కోరారు.

హీరో నితిన్ కు భవ్య క్రియేషన్స్ బర్త్ డే శుభాకాంక్షలు
సూపర్ హిట్ "కార్తికేయ ", "ప్రేమమ్ " మూవీస్ ఫేమ్, వైవిధ్య భరిత చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో యాక్షన్ ఎంటర్ టైనర్ భవ్య ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 12 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

నాగార్జున ‘శ్రీరామదాసు’కు 14 ఏళ్ళు
కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఆరంభంలో కమర్షియల్ మూవీస్‌తో ఆకట్టుకున్న ఈ ద్వయం... ఆపై భక్తిరస చిత్రాల బాట పట్టి ప్రేక్షకులను మైమరపించారు. అలాంటి వీరిద్దరి కలయికలో ‘అన్నమయ్య’(1997) వంటి జనరంజక చిత్రం తర్వాత వచ్చిన సినిమా ‘శ్రీరామదాసు’. ఇందులో శ్రీరామచంద్రుని సాక్షాత్కారం కోసం పరితపించిన పరమ భక్తుడు “రామదాసు” పాత్రలో నాగార్జున ఒదిగిపోయారు. నాగ్ కి జంటగా స్నేహ నటించిన ఈ చిత్రంలో సుమన్ శ్రీరాముడి పాత్రలో దర్శనమివ్వగా... అక్కినేని నాగేశ్వరరావు, నాజర్, నాగబాబు, అలీ, వేణుమాధవ్, సునీల్, వేద, సుజాత, సుధ, హేమ తదితరులు…

మరోసారి అజిత్ ద్విపాత్రాభినయం?
గత ఏడాది ‘నేర్కొండ పార్వై’ (బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్`కి తమిళ్ వెర్షన్) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్, దర్శకుడు హెచ్.వినోద్. కాగా, ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో `వలిమై` పేరుతో మరో సినిమా రూపొందుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అజిత్‌కి జంటగా హ్యూమా ఖురేషి నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయంతో అలరించనున్నాడని సమాచారం.

రామ్ చరణ్‌తో అనిల్ రావిపూడి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `డైరెక్టర్ నంబర్ వన్` రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం రణం రుధిరం)తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి విడుదల కానున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే పూర్తి కానుందని తెలుస్తోంది. అంతేకాదు... ఈలోపే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.

"రంగ్ దే! " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్, "మహానటి" కీర్తి సురేష్ జంటగా సూపర్ హిట్ "తొలిప్రేమ" ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే! " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

నాని ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగ్ రాయ్’ అప్ డేట్స్
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘టక్ జగదీష్’ కాగా... మరొకటి ‘శ్యామ్ సింగ్ రాయ్’. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ రూపొందిస్తున్న ‘టక్ జగదీష్’కు సంబంధించి ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరిగింది. కాగా, జూన్ 6వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా... సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

కరోనా మహమ్మారి జాగ్రత్తలపై వీడియో సాంగ్
కరోనా మహమ్మారి కారణంగా జన జీవితం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పై అవగాహన తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంగీత దర్శకుడు కోటి ఒక సాంగ్ ను కంపోజ్ చేశారు. కోటి స్వరకల్పనలో కోటి ఆలపించిన ఈ సాంగ్ లో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అభినయించారు.

రామ్ చరణ్ ‘రంగస్థలం’కు రెండేళ్ళు
అన్నదమ్ముల సెంటిమెంట్‌తో తెలుగునాట పలు చిత్రాలు సందడి చేశాయి. వాటిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ ఒకటి. ఇందులోని “చిట్టిబాబు” పాత్రలో చరణ్ అభినయించిన తీరు విమర్శకులను సైతం కట్టిపడేసింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ 80లనాటి పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో సమంత కథానాయికగా నటించింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్, అనసూయ భరద్వాజ్, రోహిణి, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించగా... స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నర్తించింది.

సినీ కార్మికుల కోసం చిరు ప్రత్యేక చారిటీ
సినీ కార్మికుల కోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి ఆర్ధిక సాయం అందించిన సంగతి తెలిసిందే. ఎక్కడి సినిమాలు అక్కడ వాయిదా పడటం... షూటింగ్ లు ఆగిపోవడంతో నిత్యావసరాలకి వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇప్పటికే పలువురు అగ్రనటులు సినీ కార్మికుల కోసం భారీ ఎత్తున విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమానికి ముందుకువచ్చారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) పేరిట ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సీసీసీ చైర్మన్ గా చిరంజీవి వ్యవహరించనుండగా, కమిటీ సభ్యులుగా డి.సురేశ్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్ వ్యవహరిస్తారు. తెలుగు చలనచిత్ర…

'లాక్ డౌన్' అయినా ఆగని నిఖిల్ '18 పేజీస్'
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడు సుకుమార్. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ అంత ఈజీ కాదు
ఇంటినుండి పని చేయడం అంత ఈజీ కాదు అంటున్నాడు రాజమౌళి తనయుడు కార్తికేయ. అసలు సంగతేంటంటే...కరోనా వల్ల చాలా మంది ఇంటి నుండే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వర్క్ కేవలం ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు మాత్రమే కాదు సినిమా వాళ్ళు కూడా ఇంటి నుండే తమ ఇంటి నుండే పనులను చక్కబెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇప్పటికే ఇంటిలో వుండే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. ఇక నిన్న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చెర్రీ ని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో అయితే అదిరిపోయింది. రాంచరణ్ యాక్షన్ , ఎన్టీఆర్ డైలాగ్స్ తో గూస్ బంప్స్ వచ్చాయి. అయితే క్రమంలోనే కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా తన టీమ్ ను ప్రశంసించాడు. ఈ…