బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను…!

I Never Want To Play NTR Role Again Says Nandamuri Balakrishna
I Never Want To Play NTR Role Again Says Nandamuri Balakrishna
మళ్లీ ఎన్టీఆర్ పాత్రను చేయనని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. అసలు సంగతేంటంటే…ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో తన తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ.. సినిమా మాత్రం అనుకున్నంత విజయం దక్కించుకోలేకపోయింది అని చెప్పొచ్చు. దీనితో బాలకృష్ణ కాస్త నిరాశపడ్డారట. అందుకే మరోసారి ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి నో చెప్పారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్నో ముఖ్యమైన పాత్రల్లో పలువురు ముఖ్య తారలు నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో… ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి బాలకృష్ణ నో చెప్పారట. ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో విష్ణు ఇందూరి కూడా ఒకరు. దానితో ఇప్పుడు ఆయన నిర్మిస్తోన్న జయలలిత బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో కూడా బాలయ్యను నటించమని కోరినా.. బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనితో ఈ సినిమాలో అసలు ఎన్టీఆర్ పాత్రను ఉంచాలా?వద్దా? అని ఆలోచిస్తున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో…
[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =