
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 186

మాస్క్ ధరించడం తప్పనిసరి..!
తమన్నా "ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్"వీడియో

థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేం..!

దుల్కర్ సల్మాన్ కు జోడీగా పూజాహెగ్డే


‘బుజ్జిగాడు’గా ప్రభాస్‌కి 12 ఏళ్ళు
ఇప్పుడు నా వంతు.. కానీ మహేష్ గెలిచాడు..!
రవితేజ, రమేష్ వర్మతో సినిమా చేస్తున్నాం

మహేష్ బాబు పర్సనల్ జిమ్
లాక్ డౌన్ ఎఫెక్ట్ లో కియారా అద్వానీ
విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ "లిగర్ " ?
బాబాయి ఎంగేజ్డ్ ఆ..! రానా-నాని ఫన్నీ ఛాట్
ఎన్టీఆర్ బర్త్ డే కు కార్తికేయ గిఫ్ట్
మా వాడిని వదిలెయ్ అన్నా.. వర్మపై మనోజ్ కామెడీ..!
జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా రికార్డ్

రకుల్ ప్రీత్ ప్లాన్స్ తారుమారు
కరోనా మహమ్మారి కారణం గా మూవీ షూటింగ్స్ , రిలీజ్ లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఇంటికే పరిమితం అయ్యారు . తెలుగు, తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ టైమ్ పాస్ చేసిన రకుల్ రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితం అయ్యి బోర్ ఫీల్ అవుతున్నారు.
మాస్క్ ధరించడం తప్పనిసరి..!
లాక్ డౌన్ నాలుగోసారి కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో లాగ కాకుండా కొన్ని సడలింపులు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. షూటింగ్స్ కు కూడా కొన్నిషరతులతో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికే అనుమతులు ఇచ్చారు.
తమన్నా "ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్"వీడియో
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా కు ఇన్ స్టా గ్రామ్ లో 10.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను తమన్నా అలరిస్తున్నారు. తమన్నా లేటెస్ట్ గా "ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్"వీడియోను షేర్ చేశారు. ట్రైనర్ సూచనలతో తలని బ్యాలెన్స్ చేస్తూ హెడ్ స్టాండ్ పొజిషన్ చేశానని , కొన్ని సార్లు ఫెయిల్ అయినా రైట్ పొజిషన్ కు చేరుకున్నానని , పర్ ఫెక్ట్ పొజిషన్ చేరేవరకు ప్రాక్టీస్ చేయాలని, ఎన్నో సార్లు ట్రై చేసిన తరువాత హెడ్ స్టాండ్ ఫీట్ సాధించానని , ట్రైనర్ లేకుండా ప్రాక్టీస్ చేయొద్దని తమన్నా చెప్పారు.

థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేం..!
సినిమా షూటింగ్ లపై.. ఎలాంటి కార్యాచరణలు తీసుకోవాలి అన్న విషయాలపై నిన్న మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు టాలీవుడ్ ప్రముఖనిర్మాతలు, డైరెక్టర్స్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశంలో సినిమాల షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. రేపటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోవడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

దుల్కర్ సల్మాన్ కు జోడీగా పూజాహెగ్డే
బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న పూజాహెగ్డే మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "అందాల రాక్షసి ", కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ", "పడి పడి లేచె మనసు" మూవీస్ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడు గా ఒక తెలుగు మూవీ రూపొందనుంది.ఈ మూవీ లో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
రానా-మిహికా నిశ్చితార్ధ వేడుకలో 'చైసామ్' ల సందడి..!
మొన్న రానా-మిహిక నిశ్చితార్ధ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయాన్నే రానా ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పడంతో ఎంగేజ్ మెంట్ జరిగిందని తెలిసిందే. లేకపోతే అయ్యిందా? అవ్వలేదా?అన్న కన్ఫ్యూజన్ లోనే ఉండేవాళ్ళు. కేవలం కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హడావుడి లేకుండా సింపుల్ గా కానిచ్చేశారు. ఇక వీరి పెళ్లి డిసెంబర్ లో జరగనుందనిఇప్పటికే సురేష్ బాబు చెప్పారు. అయితే అంతకన్నా ముందు జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు.

శోభన్‌బాబు, చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ మూవీ ‘మోసగాడు’కి 40 ఏళ్ళు
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అతిలోకసుందరి శ్రీదేవిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో దాదాపు 23 చిత్రాలు (తెలుగు, హిందీ కలిపి) తెరకెక్కగా.. వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. అలాంటి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రాల్లో ‘మోసగాడు’ ఒకటి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి ద్విపాత్రాభినయం పోషించిన తొలి చిత్రంగా ఈ సినిమాకి ప్రత్యేక స్థానముంది. ఇందులో నటభూషణ్ శోభన్‌బాబు కథానాయకుడిగా నటించగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రతినాయకుడి పాత్రలో దర్శనమిచ్చారు. కైకాల సత్యనారాయణ, గుమ్మడి, అల్లు రామలింగయ్య, సారథి, చలపతిరావు, పి.జె.శర్మ, నిర్మలమ్మ, అనిత, జయమాలిని ముఖ్య భూమికలు పోషించారు.

నాగార్జున తొలి ఆధ్యాత్మిక చిత్రం ‘అన్నమయ్య’కు 23 ఏళ్ళు
వాణిజ్యపరమైన సినిమాలతోనే కాదు.. ఆధ్యాత్మిక చిత్రాలతోనూ ప్రేక్షకులను అలరించిన వైనం ‘కింగ్’ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ద్వయం సొంతం. అలాంటి వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి ఆధ్యాత్మిక చిత్రం ‘అన్నమయ్య’. తన కీర్తనలతో ఆ పరంధాముడి హృదయ సామ్రాజ్యాన్నే ఏలిన కవి మహారాజు ‘అన్నమయ్య’ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. అటు నాగార్జునకు, ఇటు దర్శకేంద్రుడికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. ఇందులో నాగార్జునకి జోడిగా రమ్యకృష్ణ, కస్తూరి నటించగా.. శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ దర్శనమిచ్చారు. ఇక శ్రీదేవి, భూదేవిగా భానుప్రియ, శ్రీకన్య కనిపించారు. డా.మోహన్‌బాబు, రోజా, బాలయ్య, శుభ…

వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’కి 24 ఏళ్ళు
తెలుగునాట అగ్ర కథానాయకుడు ‘విక్టరీ’ వెంకటేష్, అగ్ర కథానాయిక సౌందర్య కాంబినేషన్‌కి ప్రత్యేక స్థానముంది. వీరిద్దరి కలయికలో ఏడు చిత్రాలు తెరకెక్కగా వాటిలో ఐదు సినిమాలు ఘనవిజయం సాధించడం విశేషం. వాటిలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఒకటి. అగ్రశ్రేణి దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మరో కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం 'తాయ్‌కులమే.. తాయ్‌కులమే..' ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

‘బుజ్జిగాడు’గా ప్రభాస్‌కి 12 ఏళ్ళు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి అచ్చొచ్చిన కథానాయికల్లో త్రిష ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘వర్షం’ ఘనవిజయం సాధించగా.. రెండో సినిమా ‘పౌర్ణమి’ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అలాంటి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన థర్డ్ ఫిల్మ్ ‘బుజ్జిగాడు’. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించగా ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. ఇందులో డా.మోహన్ బాబు కీలక పాత్రలో దర్శనమివ్వగా.. సంజన, కోట శ్రీనివాసరావు, సునీల్, యం.యస్.నారాయణ, అలీ, హేమ, అజయ్, సుబ్బరాజు, సుప్రీత్, ‘ఆహుతి’ ప్రసాద్, సుధ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు…
ఇప్పుడు నా వంతు.. కానీ మహేష్ గెలిచాడు..!
లాక్ డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక మహేష్ సినిమాలకు సంబంధించి అప్ డేట్ ఇవ్వడానికి ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి.. ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న వీడియోలను మాత్రం రోజుకొకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది నమ్రత. ముఖ్యంగా సితార చేస్తున్న అల్లరి, డాన్స్, సాంగ్స్ పాడటం, ఇంకా మహేష్ బాబు సితార, గౌతమ్ తో కలిసి గడుతున్న స్వీట్ మూమెంట్స్ కు సంబంధించిన వీడియోస్ సూపర్ స్టార్ ఫ్యాన్ కి కను విందు కలిగిస్తున్నాయి.
రవితేజ, రమేష్ వర్మతో సినిమా చేస్తున్నాం
మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. నిజానికి ఈ సినిమా ఈ నెల మొదటి వారంలో రిలీజ్ కావాల్సి వుంది కానీ లాక్ డౌన్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
రేపటి నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్..!
లాక్ డౌన్ వల్ల ఇప్పటికే అనేక చిత్రాల షూటింగ్ మధ్యలో ఆగిపోగా, పూర్తి అయిన సినిమాల విడుదల ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు కొన్ని సడలింపులు చేసిన నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా అనుమతి కోసం ఎదురుచూస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే షూటింగ్స్ జరుగుతున్నాయి .ఇక ఏపీ ప్రభుత్వం కూడా షూటింగ్స్ కు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన అనుమతులనిచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటివరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి దీనిపై ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు.

మహేష్ బాబు పర్సనల్ జిమ్
"భరత్ అనే నేను", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు " వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంటిలో మహేష్ బాబు పర్సనల్ జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ తన జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తారు.
లాక్ డౌన్ ఎఫెక్ట్ లో కియారా అద్వానీ
బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను " మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి " హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " మూవీ లో హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ ఘనవిజయంతో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన "లక్ష్మీ బాంబ్ ", "ఇందూ కి జవానీ ", "షేర్ షా "," భూల్ భులయ్యా 2" మూవీస్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయాయి.
విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ "లిగర్ " ?
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సర్ గా విజయ్ నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక కాగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ముంబై లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.
బాబాయి ఎంగేజ్డ్ ఆ..! రానా-నాని ఫన్నీ ఛాట్
మొత్తానికి రానా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇన్ని రోజులు ప్రేమ, పెళ్లి అంటేనే అంత దూరంగా వెళ్లిన రానా ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ అయ్యాడు. ఇక రానా తన ప్రేమ విషయం వెల్లడించినప్పట్నుంచి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడా అంటూ అందరూ ఎదుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో పలు వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక అలా తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాడో లేదో అప్పుడే ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చేసాడు రానా. సాయంత్రం రానా-మిహీకల నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై కేవలం మాటలు మాత్రమే నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాల గురించి మాత్రమే చర్చించుకున్నారని అన్నారు. కానీ తాజాగా రానా…
ఎన్టీఆర్ బర్త్ డే కు కార్తికేయ గిఫ్ట్
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ, ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక వినూత్న గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ "నాన్నకు ప్రేమతో " మూవీ లోని "ఐ వన్నా ఫాలో ఫాలో యు " సాంగ్ లో ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ కార్తికేయ ఒక వీడియో రూపొందించారు.
మా వాడిని వదిలెయ్ అన్నా.. వర్మపై మనోజ్ కామెడీ..!
మా వాడిని వదిలెయ్ అన్నా.. వర్మపై మనోజ్ కామెడీ..! నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీ సెలబ్రిటీస్ అందరూ తమ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేసిన సంగతి తెలిసిందే. అయితే అందరు సెలబ్రిటీస్ చెప్పడం ఒక ఎత్తైతే...వర్మ ట్వీట్ మాత్రం మరో ఎత్తు. అందరికంటే భిన్నంగా స్పందిస్తాడు కాబట్టే వర్మ కాస్త డిఫరెంట్. ఇక నిన్న కూడా ఎన్టీఆర్ పిక్ పై అలానే స్పందించాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫొటో ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పిక్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పిక్ ను ట్వీట్…
జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా రికార్డ్
మే 20వ తేదీ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినీ సెలబ్రిటీస్, అభిమానులు, ప్రేక్షకుల విషెస్ సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన పుట్టిన రోజు ను ఎన్టీఆర్ జరుపుకున్నారు. #HAPPY BIRTH DAY హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో దూసుకు పోయింది. 24 గంటలలో 21.5 మిలియన్ ట్వీట్స్ తో ఇండియా లో ట్రెండింగ్ టాపిక్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ ఎన్టీఆర్ కు ఉన్న పాప్యులారిటీ తెలియజేసింది.