
లాక్ డౌన్ వల్ల ఇప్పటికే అనేక చిత్రాల షూటింగ్ మధ్యలో ఆగిపోగా, పూర్తి అయిన సినిమాల విడుదల ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు కొన్ని సడలింపులు చేసిన నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా అనుమతి కోసం ఎదురుచూస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే షూటింగ్స్ జరుగుతున్నాయి .ఇక ఏపీ ప్రభుత్వం కూడా షూటింగ్స్ కు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన అనుమతులనిచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటివరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి దీనిపై ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ మీటింగ్ లో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే రేపటి నుండి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. దీనిపై ఓ నివేదిక తయారు చేసి, రెండు రోజులలో కేసిఆర్ ని కలవనున్నారు. అలాగే పరిశ్రమ అభివృద్ధి, షూటింగ్స్ అనుమతి వంటి విషయాలు ఆయనతో చర్చించనున్నారు. ఇక సందర్భంగా చిత్ర పరిశ్రమ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. తప్పని సరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్ లను ధరించాలని, శానిటైజేషన్ ఉపయోగించాలని, బౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని కూడా మంత్రిగారు చెప్పినట్టు సమాచారం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: