ఇప్పుడు నా వంతు.. కానీ మహేష్ గెలిచాడు..!

Namrata Shirodkar Posts Another Adorable Video of Mahesh Babu
Namrata Shirodkar Posts Another Adorable Video of Mahesh Babu

లాక్ డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక మహేష్ సినిమాలకు సంబంధించి అప్ డేట్ ఇవ్వడానికి ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి.. ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న వీడియోలను మాత్రం రోజుకొకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది నమ్రత. ముఖ్యంగా సితార చేస్తున్న అల్లరి, డాన్స్, సాంగ్స్ పాడటం, ఇంకా మహేష్ బాబు సితార, గౌతమ్ తో కలిసి గడుతున్న స్వీట్ మూమెంట్స్ కు సంబంధించిన వీడియోస్ సూపర్ స్టార్ ఫ్యాన్ కి కను విందు కలిగిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవల తన కుమారుడు గౌతమ్ తో కలిపి ‘బ్లింక్ అండ్ యు లాస్’ అదేనండీ.. రెప్పవాల్చకుండా కళ్లు ఎంతసేపు తెరిచి ఉంచుతారో అనే ఆట ఆడిన వీడియోను నమ్రత పోస్ట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు అదే ఆట నమ్రత మహేష్ తో ఆడింది. ఇక ఈ వీడియోను కూడా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.. “మహేశ్ వర్సెస్ గౌతమ్ పోటీ అయిపోయింది…ఇప్పుడు నా వంతు… అయితే ఈ గేమ్ లో మళ్ళీ మహేశ్ బాబే గెలిచాడు. ఈ గేమ్ లో నేను సూపర్, కానీ ఎందుకో మహేష్ తో గెలవలేకపోతున్నా” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.

మహేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి తర్వాత ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో సెన్సషనల్ హిట్ అందుకున్నాడు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మహేష్ బాబు…పరశురామ్ సినిమా ప్రారంభం అవుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 8 =