మాస్క్ ధరించడం తప్పనిసరి..!

Super Star Mahesh Babu Urges Everyone To Make A Habit Of Wearing Mask Every time They Step Out Of Their Homes
Super Star Mahesh Babu Urges Everyone To Make A Habit Of Wearing Mask Every time They Step Out Of Their Homes

లాక్ డౌన్ నాలుగోసారి కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో లాగ కాకుండా కొన్ని సడలింపులు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. షూటింగ్స్ కు కూడా కొన్నిషరతులతో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికే అనుమతులు ఇచ్చారు.

ఇక ప్రజలు బయటకొస్తున్న నేపథ్యంలో తాను మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేస్తూ, అందరూ మాస్కులు ధరించాలని హీరో మహేశ్ బాబు సూచించాడు. ఇప్పుడిప్పుడే అన్ని చక్కబడుతున్నాయి.. కాస్త టైం పట్టొచ్చు కానీ తప్పకుండా మామూలు పరిస్థితికి వస్తాం.. కానీ ఇప్పుడు మాత్రం మాస్క్ ధరించడం తప్పనిసరి.. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి…మనతో పాటు మనచుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడినవాళ్లమవుతాం అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి భారీ హిట్ తర్వాత ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. త్వరలోనే ప్రకటన ఇస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here