దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అతిలోకసుందరి శ్రీదేవిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో దాదాపు 23 చిత్రాలు (తెలుగు, హిందీ కలిపి) తెరకెక్కగా.. వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. అలాంటి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రాల్లో ‘మోసగాడు’ ఒకటి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి ద్విపాత్రాభినయం పోషించిన తొలి చిత్రంగా ఈ సినిమాకి ప్రత్యేక స్థానముంది. ఇందులో నటభూషణ్ శోభన్‌బాబు కథానాయకుడిగా నటించగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రతినాయకుడి పాత్రలో దర్శనమిచ్చారు. కైకాల సత్యనారాయణ, గుమ్మడి, అల్లు రామలింగయ్య, సారథి, చలపతిరావు, పి.జె.శర్మ, నిర్మలమ్మ, అనిత, జయమాలిని ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం సమకూర్చగా చక్రవర్తి వీనులవిందైన బాణీలు అందించారు. “ఏ వసంతమిది”, “ఆ చూపుకర్థమేంది”, “ఓ కురిసే నవ్వులా”, “ఆకుంది ఒక చోట”, “ఎగరాలి జాతీయ పతాకం”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై క్రాంతికుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1980 మే 22న విడుదలైన ‘మోసగాడు’.. నేటితో 40 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
‘మోసగాడు’ – కొన్ని విశేషాలు:
* శోభన్‌బాబు, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రమిది. అంతకుముందు ‘బాబు’, ‘రాజా’, ‘రాధాకృష్ణ’ వంటి చిత్రాలు వీరి కాంబోలో తెరకెక్కాయి. అలాగే శ్రీదేవి కాంబినేషన్‌లో కూడా దర్శకేంద్రుడికిది నాలుగో చిత్రం. అంతకుముందు ‘పదహారేళ్ళవయసు’, ‘వేటగాడు’, ‘ఘరానాదొంగ’ వంటి సినిమాలు వీరిద్దరి కలయికలో రూపొందాయి.
* చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన మొట్టమొదటి సినిమా ‘మోసగాడు’. ఈ చిత్రం తరువాత చిరు, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో మరో పదమూడు చిత్రాలు రూపొందాయి.
* చిరంజీవి, శ్రీదేవి కలయికలో వచ్చిన తొలి చిత్రంగా ‘మోసగాడు’కి ప్రత్యేక స్థానముంది.
* ‘ప్రాణంఖరీదు’, ‘పునాదిరాళ్ళు’ వంటి చిత్రాల తరువాత చిరు, నిర్మాత క్రాంతికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది.
* క్రాంతికుమార్ నిర్మాణంలో శ్రీదేవి నటించిన ఫస్ట్ మూవీ ఇది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: