రానా-మిహికా నిశ్చితార్ధ వేడుకలో ‘చైసామ్’ ల సందడి..!

Chay - Sam Steal The Show In Rana - Miheeka Engagement

మొన్న రానా-మిహిక నిశ్చితార్ధ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయాన్నే రానా ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పడంతో ఎంగేజ్ మెంట్ జరిగిందని తెలిసిందే. లేకపోతే అయ్యిందా? అవ్వలేదా?అన్న కన్ఫ్యూజన్ లోనే ఉండేవాళ్ళు. కేవలం కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హడావుడి లేకుండా సింపుల్ గా కానిచ్చేశారు. ఇక వీరి పెళ్లి డిసెంబర్ లో జరగనుందనిఇప్పటికే సురేష్ బాబు చెప్పారు. అయితే అంతకన్నా ముందు జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు.

ఇక ఇదిలా ఉండగా ఈ వేడుకలో మరో జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ జంట ఏదో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. నాగ చైతన్య- సమంత. ఈ నిశ్చితార్ధ వేడుకలో టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య-సమంతల జంట ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. వీరిద్దరూ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. చైతన్య రామానాయుడికి స్వయానా మనువడు కాగా రానాకు బావమరిది వరుస అవుతాడు.

ఈ నేపథ్యంలో ఈ వేడుకలో తీసుకున్న ఫొటోలను సామ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు తన భర్త నాగచైతన్య ఫొటో షేర్‌ చేసి కామెడీ చేసింది . ‘అమ్మ, అంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సమయం వచ్చింది. చూడండి నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా?? అని పోస్ట్ లో పేర్కొన్నారు. దీనిపై అంతే సరదాగా స్పందించిన నాగచైతన్య.. చూస్తుంటే ఇది పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందని అన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here