బాబాయి ఎంగేజ్డ్ ఆ..! రానా-నాని ఫన్నీ ఛాట్

Natural Star Nani Engage In A Fun Banter With Rana Daggubati

మొత్తానికి రానా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇన్ని రోజులు ప్రేమ, పెళ్లి అంటేనే అంత దూరంగా వెళ్లిన రానా ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ అయ్యాడు. ఇక రానా తన ప్రేమ విషయం వెల్లడించినప్పట్నుంచి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడా అంటూ అందరూ ఎదుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో పలు వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక అలా తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాడో లేదో అప్పుడే ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చేసాడు రానా. సాయంత్రం రానా-మిహీకల నిశ్చితార్థం జరిగిందని సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై కేవలం మాటలు మాత్రమే నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాల గురించి మాత్రమే చర్చించుకున్నారని అన్నారు. కానీ తాజాగా రానా ట్విటర్‌లో ఫోటోలు షేర్ చేసి కన్ఫామ్ చేసేశాడు. ప్రస్తుతం రానా పోస్ట్‌ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సందర్భంగా రానా-నాని మధ్య జరిగిన ఫన్నీ చాట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రానా-నాని మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ అందరికీ తెలిసిందే. రానా మిహికా ను పరిచయం చేసినప్పుడే ‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020 లో’ అని సరదాగా ట్వీట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటది కదా. ఇప్పుడు రానా ఎంగేజ్మెంట్ పై కూడా అలానే కామెడీ గా రియాక్ట్ అయ్యాడు. ఆ చాట్ మీరు కూడా చూడండి.

ఇక వీరి వివాహం ఈ ఏడాది చివర్లో ఉంటుందని సమాచారం. రానా తండ్రి గారైన సురేష్ బాబు కొద్దిరోజుల క్రితం రానా-మిహికాల వివాహం డిసెంబర్ లోపే ఉంటుందని చెప్పడం జరిగింది. చూడబోతే పెళ్లి భాజాలు కూడా తొందర్లనే మోగించేటట్టే ఉన్నారు. మొత్తానికి 2020లో రానా బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 4 =