బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న పూజాహెగ్డే మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “అందాల రాక్షసి “, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “, “పడి పడి లేచె మనసు” మూవీస్ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడు గా ఒక తెలుగు మూవీ రూపొందనుంది.ఈ మూవీ లో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మహానటి “, “హేయ్ పిల్లగాడ “, “కనులు కనులు దోచాయంటే” మూవీస్ తో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీ లో దుల్కర్ , పూజాహెగ్డే జంటగా నటించనున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. #Prabhas 20 మూవీ లో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే “కభీ ఈద్ కభీ దివాలీ ” హిందీ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: