కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 185

సినిమా వార్తలు

హీరోయిన్ రెజీనా ?

పలు హిట్ చిత్రాలలో నటించిన రెజీనా టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రెజీనా నటించిన "ఎవరు" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రెజీనా ప్రస్తుతం 4 తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కన్ఫామ్.. స్టార్ హీరోతో నెక్స్ట్ సినిమా

టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు. పెద్ద ఫైట్లు, కమెర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకుండా.. మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో దిట్ట. 'డాలర్ డ్రీమ్స్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైనా.. 'ఆనంద్' సినిమాతో మంచి సక్సెస్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, 'లీడర్'' వంటి విజయాలను అందుకున్న తర్వాత 'అనామిక' సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. గత ఏడాది విడుదలైన 'ఫిదా' చిత్రంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు శేఖర్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బిజీ యంగ్ హీరో నాగశౌర్య

"ఊహలు గుస గుసలాడే , "జో అచ్యుతానంద ", "ఛలో ", "కణం ", "ఓ బేబీ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. హీరో నాగశౌర్య తో జంటగా నటించి టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా , రష్మిక లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించడం విశేషం. నాగశౌర్య స్వంత ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్ పై "ఛలో ", "నర్తనశాల ", "అశ్వ‌థ్థామ‌" మూవీస్ నిర్మించారు. "అశ్వ‌థ్థామ‌"మూవీ లో మాస్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగశౌర్య ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

జూన్ నుండి షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్..!

లాక్‌డౌన్‌తో బుల్లితెర, వెండితెర షూటింగ్స్ నుంచి ప్రొడక్షన్, ఇతర కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయాయి. ఒకపక్క పక్క రాష్ట్రాల్లో షూటింగ్ లకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో ఇక్కడ కూడా అనుమతుల కోసం టాలీవుడ్ పెద్దలు ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌, ఎన్‌.శంకర్‌, అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, రాధాకృష్ణ, సీ. కల్యాణ్, సురేష్‌బాబు, కొరటాల శివ తదితరలు ప్రగతిభవన్‌కు వెళ్లి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో చర్చలు జరిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"చంద్రముఖి 2" మూవీ లో సిమ్రాన్ ?

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి . వాసు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా రూపొందిన కామెడీ హారర్ తమిళ మూవీ "చంద్రముఖి "ఘనవిజయం సాధించింది. ప్రభు , జ్యోతిక, నయనతార ఇతర ముఖ్య తారాగణం. 2005 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "చంద్రముఖి " కూడా ఘనవిజయం సాధించింది. "చంద్రముఖి" మూవీ లో గంగ, చంద్రముఖి పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జ్యోతిక బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు మృతి

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ గుండెపోటుతో మృతి చెందారు. చెనై అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్‌గా పనిచేస్తున్న అభినయ్‌ నిద్రలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు చెపుతున్నారు. తన ప్యాలెస్ పనుల నిమిత్తం నిన్న చెంగల్‌పట్టుకు వెళ్లి..అక్కడ కుటుంబంతో సరదాగా గడిపాడని..ఉదయం కల్లా ఇంత ఘోరం జరిగిందని సన్నిహితులు తెలిపుతున్నారు. చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్
Akkineni Nagarjuna Debut Movie Vikram Completes 34 Years.
సినిమా వార్తలు

నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’కు 34 ఏళ్ళు

ఒక మహానటుడు తనయుడు కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్నాడంటే.. ఆ అంచనాలు భారీగా ఉంటాయి. అందునా.. ఆ కథానాయకుడు నటించబోయే సినిమా.. పరభాషలో ఘనవిజయం సాధించిన చిత్రమైతే.. ఇక ఆ అంచనాలకు ఆకాశమే హద్దు. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగా తొలిచిత్రంతోనే మరపురాని విజయాన్ని అందుకుని.. అంచెలంచెలుగా ఎదిగి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఆ కథానాయకుడు. అతను మరెవరో కాదు.. ‘కింగ్’ నాగార్జున. ఆ చిత్రమే.. ‘విక్రమ్’.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’కు ఆరేళ్ళు

ఒకే కుటుంబానికి చెందిన మూడు త‌రాల క‌థానాయ‌కులు ఒకే సినిమాలో క‌ల‌సి న‌టించ‌డం అరుదైన విష‌య‌మనే చెప్పాలి. అలాంటి అరుదైన అంశానికి వేదిక‌గా నిలిచిన చిత్రం ‘మనం’. అక్కినేని మూడు తరాల కథానాయకులైన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ‘కింగ్’ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ మెమ‌ర‌బుల్ మూవీని విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేశాడు. నాగ్‌కి జోడిగా శ్రియాశరన్, చైతూకి జంట‌గా సమంత నటించిన ఈ సినిమాలో శరణ్య, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం, సప్తగిరి, యం.యస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, శంకర్ మేల్కోటే, కృష్ణుడు, గుండు సుదర్శన్ ముఖ్య భూమికలు పోషించగా.. అమల…

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu First Nandi Award Winning Movie Nizam Completes 17 Years.
సినిమా వార్తలు

మహేష్‌ బాబుకి 'ఉత్త‌మ న‌టుడు'గా తొలి ‘నంది’ని అందించిన ‘నిజం’కి 17 ఏళ్ళు

తెలుగునాట ప్రయోగాలకు పెద్ద పీట వేసే కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అలా మహేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రాలకు సంబంధించి జయాపజయాలను పక్కన పెడితే.. కొన్ని చిత్రాలు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలా.. ప్రశంసలు అందుకున్న చిత్రాల్లో 'నిజం' ఒక‌టి. 'యాంటి కరప్షన్' బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంచలన దర్శకుడు తేజ రూపొందించాడు. ఇందులో రక్షిత క‌థానాయిక‌గా న‌టించ‌గా గోపీచంద్, రాశి, ‘తాళ్ళూరి’ రామేశ్వరి, ప్రకాష్‌రాజ్, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, జీవా, కాంతారావు, విజయచందర్, రాళ్ళపల్లి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, షకీలా, సుమన్ శెట్టి, మణిచందన ముఖ్య…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్?

గత ఏడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’తో మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు పూరి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. కాగా, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అగ్ర యువ కథానాయకుడితో శేఖర్ కమ్ముల చిత్రం

ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల.. త్వరలో ‘లవ్ స్టోరీ’తో పలకరించనున్నాడు. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా.. చిత్రీకరణ తుదిదశలో ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మామయ్య పై వస్తున్న వార్తలు నిజమే.. కానీ..!

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యానికి గురయ్యారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని గ్యాస్ట్రో ఎంటరాలజీలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే మరోవైపు ఈ వార్తల్లో నిజం లేదు.. కేవలం పుకార్లు అన్న మాట కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో దీనిపై నటుడు ఉత్తేజ్ స్పందించి... సుద్దాల అశోక్ తేజ అనారోగ్యం గా ఉన్నారన్న వార్తలు వాస్తవమేనని అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ తేజ ఆరోగ్యంపై వివరణ ఇస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్-గౌతమ్ ల హైట్ చెక్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటాడు.తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు మహేష్. అలాంటిది ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటూ సితార, గౌతమ్ లతో కలిసి ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'భారతీయుడు2' లొకేషన్ ఛేంజ్..!

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాకు మొదటినుండి పలు అడ్డంకులే ఎదురయ్యాయి అని చెప్పొచ్చు. వాటన్నిటిని తట్టుకొని ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను జరుపుకోగా.. లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్‌ స్పాట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా వచ్చి పడి ఇంకా పెద్ద బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
COVID 19 Cant Stop Telugu Audience From Watching Movies
సినిమా వార్తలు

సినిమాని చూడాలన్న ప్రేక్షకుల కోరికని 'కోవిడ్-19' ఆపలేదు..!

పుట్టిన ప్రతి మనిషి తాను ఏ రంగంలో రాణించినా, రాణించకున్నా.. సంపాదించినా సంపాదించుకున్నా.. అలసిపోయినా, ఆనందంగా ఉన్నా.. తన దినచర్యలో ఒక్కసారైనా.. సినిమాని చూడాలి, సినిమా గురించి వినాలి, సినిమా గురించి మాట్లాడాలి అని అనుకుంటూనే ఉంటాడు. అసలు సినిమా ఊసులు లేకపోతే పొద్దే పోనివాళ్లు అసంఖ్యాకం, అనేకం అంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగా ఎవరికైనా ఊహించని కష్టాలు ఎదురైతే వాడికి 'సినిమా-కష్టాలు' వచ్చాయి అంటుంటారు. అటువంటిది ఈ 'కోవిడ్-19' రూపంలో సినిమాకి, సినిమావాళ్ళకి నిజంగానే 'సినిమా-కష్టాలు' వచ్చి పడ్డాయి. ఓ రకంగా చూస్తే సినిమాకి కష్టాలు రావడం వాటిని తట్టుకుని సినిమా నిలబడటం సినిమాకి కొత్త ఏమీ కాదు

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు

సినిమా షూటింగ్స్ అనుమతుల గురించి చర్చించేందుకు గాను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ లో సినీపెద్దలు కేసీఆర్ తో పలు విషయాలపై మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా సీఎం జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చిని చెప్పినట్టు సమాచారం. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని..షూటింగ్ లోకేషన్స్‌లో లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాలని, లోకేషన్‌ను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని కేసీఆర్‌ సూచించినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'చిరుత' సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుంది..!

నేహా శర్మ చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా చిరుత. ఈ సినిమాతోనే చరణ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా శర్మ నటించింది. ఈ సినిమాలో పెద్ద బిజినెస్ మేన్ కూతురిగా... పొగరు పాత్రలో బాగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక చిరుత తర్వాత కుర్రాడు సినిమా చేసింది. ఇక ఆ సినిమా తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. అందులోనూ నేహా శర్మ కూడా బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టిపెట్టడంతో ఇక్కడ అవకాశాలు రాలేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ హీరోయిన్ టాప్ త్రీ లో ఉంటుంది..!

ఫ్యూచర్ లో ఆ హీరోయిన్ టాప్ త్రీ ప్లేస్ లో ఉంటుందని అంటుంది చార్మీ. ఇంతకీ ఛార్మి ఏ హీరోయిన్ గురించి మాట్లాడుతుంది.. ఏ హీరోయిన్ ఫ్యూచర్ గురించి చెపుతుంది అని అనుకుంటున్నారు కదా.. ఇంకెవరూ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ కు జోడిగా అనన్య పాండే నటిస్తుంది. ఈ సినిమాకు ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"దృశ్యం" మూవీ సీక్వెల్

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన "దృశ్యం " మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. "దృశ్యం " మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహ లీస్ భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించింది. చైనీస్ భాష లో రీమేక్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీ గా "దృశ్యం " రికార్డ్ క్రియేట్ చేసింది. "దృశ్యం " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా కేరళ స్టేట్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇన్ స్టా గ్రామ్ లో 5 మిలియన్ ఫాలోవర్స్

తెలుగు, తమిళ , మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. పలు చిత్రాలలో నటిస్తూ కీర్తి సురేష్ బిజీ గా ఉన్నారు. తెలుగు లో "గుడ్ లక్ సఖి ", "రంగ్ దే " మూవీస్ లో నటిస్తున్న కీర్తి సురేష్ తమిళ భాషలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న "అన్నాత్తే " మూవీ లో నటిస్తున్నారు . కీర్తి నటించిన "మిస్ ఇండియా "(తెలుగు ), "మరక్కార్ "(మలయాళం ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్