
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 187

దృశ్యం`కి సీక్వెల్
ప్రభాస్‌కి జోడిగా అలియా భట్?
కార్తి, తమన్నా ‘ఆవారా’కి 10 ఏళ్ళు
చిత్ర ప్రముఖులతో చిరంజీవి మీటింగ్

బాలకృష్ణ చాలా మంచి మనిషి..!
మణిరత్నం సినిమాలో నటించట్లేదు.. !
విజయ్ దేవరకొండ తో నటిస్తా - శ్రావణ భార్గవి

ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చినట్టేనా..!

హీరో రానా , మిహీకా బజాజ్ ల నిశ్చితార్థం

ఈ రోజు మాటలే.. ఎంగేజ్మెంట్ కాదు..!

"అహం బ్రహ్మస్మి "స్పెషల్ పోస్టర్
ఫ్లోటింగ్ వాటర్ సౌండ్ తో అదితి డ్యాన్స్
నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తా మాటిస్తున్నా..!
"అహం బ్రహ్మస్మి " మూవీ లో భారీ యాక్షన్ సీన్

OFFICIAL! రానా -మిహికా ఎంగేజ్మెంట్ అయిపోయింది
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి మొత్తానికి ఒక ఇంటివాడవ్వబోతున్నాడు. ఇటీవల తన ప్రేమను మిహికా బజాజ్ ఒప్పుకుందని హీరో రానా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ కల్లా పెళ్లి చేసేస్తామని ప్రముఖ నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు ఇదివరకే స్పష్టం చేశారు కూడా. అయితే నిన్న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక నిర్వహించినట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. లాక్డౌన్ నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు సురేష్ బాబు కూడా ఎంగేజ్ మెంట్ కాదు కేవలం మాటలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం అని చెప్పినట్టు కూడా వార్తలు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘అడవి రాముడు’కి 16 ఏళ్ళు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా పలు మాస్ ఎంటర్టైనర్స్ తెరకెక్కాయి. వాటిలో ‘అడవి రాముడు’ ఒకటి. ఆర్తీ అగర్వాల్ నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అగ్రశ్రేణి దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించారు. నాజర్, బ్రహ్మానందం, సాయికుమార్, రాళ్ళపల్లి, రాజీవ్ కనకాల, రంగనాథ్, వేణుమాధవ్, రవిబాబు, శివారెడ్డి, జి.వి.సుధాకర్ నాయుడు, అజయ్ రత్నం, ‘తెలంగాణా’ శకుంతల, బండ్ల గణేష్, సీమ ముఖ్య పాత్రలు పోషించగా.. రమ్యకృష్ణ ప్రత్యేక గీతంలో మెరిసింది.
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మొదటి సినిమా ‘రాముడు భీముడు’కి 56 ఏళ్ళు
సురేష్ ప్రొడక్షన్స్.. దేశం గర్వించదగ్గ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. పరాజయాల్లోనూ అవకాశాలుంటాయని నమ్మిన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. అందుకే విజయాలు ఈ సంస్థ వెంటే నడిచాయి. అంతేకాదు.. దాదాపు అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఘనత ఈ సంస్థది. అలాంటి సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు నిర్మించిన మొట్ట మొదటి చిత్రం ‘రాముడు భీముడు’. మొదటి ప్రయత్నంతోనే అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు డి.రామానాయుడు. ఈ చిత్రం కోసమే నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు తన కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. జమున, ఎల్.విజయలక్ష్మి…
దృశ్యం`కి సీక్వెల్
‘దృశ్యం’.. 2013లో విడుదలైన ఈ మలయాళ చిత్రం మాలీవుడ్‌లో వసూళ్ళ వర్షం కురిపించి అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, సింహళీ భాషల్లోనూ పునర్నిర్మితమై ఆయా చోట్ల మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. గత దశాబ్దంలోనే ఎక్కువ భాషల్లో రీమేక్ అవడమే కాకుండా.. చైనాలో రీమేక్ అయిన తొలి భారతీయ చిత్రంగానూ చరిత్ర సృష్టించింది. కట్ చేస్తే.. 7 ఏళ్ళ తరువాత ‘దృశ్యం’కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్.

షూటింగ్ లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - కండీషన్స్ అప్లయ్
లాక్ డౌన్ వల్ల ఎక్కడెక్కడి షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సినిమాలే కాదు.. టీవీ సీరియళ్లు, పలు షోల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దీనితో ఇండస్ట్రీ కి పెద్ద ఎత్తున నష్టమే కలిగింది. అయితే నాలుగోసారి లాక్ డౌన్ పొడిగించిన తర్వాత షూటింగ్స్ కు మాత్రం కొన్ని నిబంధనలతో షూటింగ్ లు చేసుకునేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు మూడు కేటిగిరిలుగా విభజించారు.
ప్రభాస్‌కి జోడిగా అలియా భట్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘మహానటి’ ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2022 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కార్తి, తమన్నా ‘ఆవారా’కి 10 ఏళ్ళు
కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన పలు తమిళ సినిమాలు అనువాద రూపంలో తెలుగులోనూ విడుదలై మంచి విజయాలు సాధించాయి. వాటిలో ‘ఆవారా’(తమిళంలో ‘పయ్యా’) ఒకటి. ఇందులో కార్తికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. యన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో సోనియా దీప్తి, మిలింద్ సోమన్, జగన్, అర్పిత్, జస్పేర్, రామచంద్రన్ దురైరాజ్, దర్శన్ జరీవాలా ముఖ్య భూమికలు పోషించారు.
చిత్ర ప్రముఖులతో చిరంజీవి మీటింగ్
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులకు లోనైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోయి, రిలీజ్ లు ఆగిపోయి చిత్ర పరిశ్రమ తీవ్రం గా నష్టపోయింది. ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రులు కరోనా తో జీవించాల్సిందే అన్న నేపథ్యం లో షూటింగ్స్ ప్రారంభానికై నిర్మాతలు, దర్శకులు, హీరోలతో తన ఆఫీస్ లో రేపు (21 తేదీ) చిరంజీవి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు.

బాలకృష్ణ చాలా మంచి మనిషి..!
నందమూరి బాలకృష్ణ పైకి కాస్త గంభీరంగా.. కోపిష్టిగా కనపడినా ఆయన గురించి సినీ ఇండస్ట్రీలో ఎవర్ని అడిగినా మాత్రం చాలా మంచివారని.. చిన్న పిల్లల మనస్తత్వం అని చెపుతుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా అదే చెబుతుంది. ఆమె ఎవరో కాదు ఛార్మి. హీరోయిన్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఛార్మి.. తన కెరీర్లో ఎక్కువ విజయాలను సొంతం చేసుకోలేక పోయిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నటనకు దూరంగా వుంటూ.. పూరీ జగన్నాథ్ తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. ఇటీవలే రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టింది.
మణిరత్నం సినిమాలో నటించట్లేదు.. !
సమ్మోహనం సినిమాతో టాలివుడ్లో అరంగేట్రం చేసిన అదితి రావు హైదరి మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది. తరువాత అంతరిక్షం సినిమాలో నటించింది అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ అదితి కి మాత్రం ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.
విజయ్ దేవరకొండ తో నటిస్తా - శ్రావణ భార్గవి
సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. "బోణి " మూవీ తో శ్రావణ భార్గవి టాలీవుడ్ కు సింగర్ గా పరిచయం అయ్యారు. "సింహా " లో సింహమంటి చిన్నోడే , "దమ్ము" లో వాస్తు బాగుందే, "కెమెరా మెన్ గంగతో రాంబాబు" లో జొరమొచ్చింది , "S/O సత్యమూర్తి "లో సూపర్ మచ్చి వంటి సాంగ్స్ శ్రావణ భార్గవికి మంచి పేరు తెచ్చాయి. "లవ్ ఫెయిల్యూర్ ", "గబ్బర్ సింగ్ ", "ఈగ ", "రామయ్యా వస్తావయ్యా " మూవీస్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.

ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చినట్టేనా..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. ఇక సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'కేజీఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ రోజుకో వార్త మాత్రం వస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పెద్ద ఎత్తున డేట్స్ కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా పై ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.

హీరో రానా , మిహీకా బజాజ్ ల నిశ్చితార్థం
సక్సెస్ ఫుల్ "లీడర్ " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన రానా దగ్గుబాటి "కృష్ణం వందే జగద్గురుమ్ "," రుద్రమదేవి", బాహుబలి ", "ఘాజి ", "నేనే రాజు నేనే మంత్రి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ భాషతో పాటు హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. రానా ప్రస్తుతం "విరాటపర్వం 1992 "మూవీ లో నటిస్తున్నారు. రణహీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన "అరణ్య " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ రోజు మాటలే.. ఎంగేజ్మెంట్ కాదు..!
అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టు.. సెలబ్రిటీస్ గురించి వార్తలు మాత్రం ఈ రేంజ్ లోనే వస్తుంటాయి. అలానే ఉంది ఇప్పుడు రానా విషయంలో. ఇటీవలే తన ప్రేమను సోషల్ మీడియా వేదికగా బయటి ప్రపంచానికి పరిచయం చేశాడు రానా. మిహిక బజాజ్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న రానా ఫైనల్లీ ఎస్ చెప్పింది అని ట్విట్టర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రానా ఇచ్చిన షాక్ కు అందరూ మొదట షాకవ్వగా.. ఆ తర్వాత అందరు అభినందనలు తెలిపారు. కొంతమంది టాలీవుడ్ హీరోలు మాత్రం కామెడీ కూడా చేశారనుకోండి. ఇక ప్రభాస్, రానా పై వచ్చిన మీమ్ ల సంగతి గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు రోజులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసాయి.

"అహం బ్రహ్మస్మి "స్పెషల్ పోస్టర్
మనోజ్ మంచు స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ హీరోగా "అహం బ్రహ్మస్మి "మూవీ రూపొందుతుంది. రాజా ఆఫ్ విక్రమ్ సింహపురి గా మనోజ్ నటిస్తున్న ఈ మూవీ తెలుగు ,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
'పక్కా లోకల్’ సాంగ్‌తో ఎన్టీఆర్ కు మరోసారి వార్నర్ విషెస్..!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎన్టీఆర్ అభిమాని కోరిక మేరకు నిన్న ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. రేపు పుట్టినరోజు కావడంతో...జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపమని ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా డేవిడ్ వార్నర్ ను కోరగా "హ్యాపీ బర్త్ డే బడ్డీ" అంటూ ట్వీట్ చేసాడు.
ఫ్లోటింగ్ వాటర్ సౌండ్ తో అదితి డ్యాన్స్
సక్సెస్ ఫుల్ "సమ్మోహనం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి "అంతరిక్షం 9000 KMPH"మూవీ తో ప్రేక్షకులను అలరించారు. "ఏ సాలీ జిందగీ ", "పద్మావత్ " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అదితి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. "కాట్రు వెళియిడై " తమిళ మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ అందుకున్నారు. తమిళ , హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న అతిది నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తా మాటిస్తున్నా..!
ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ లేదుకానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కు విషెస్ తెలియచేయగా ఇప్పుడు హీరో రామ్‌చరణ్ కూడా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ‘నా ప్రియమైన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నేను నీకు రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నానని తెలుసు. కానీ నేను ఉత్తమమైన గిఫ్ట్ ఇస్తానని మాట ఇస్తున్నాను. మరెన్నో సెలబ్రేషన్ ముందున్నాయి.. ’ అని ట్వీట్ చేసాడు.
ఎన్టీఆర్ కు బిగ్‌బాస్ టీమ్ స్పెషల్ వీడియో తో విషెస్..!
ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హవానే నడుస్తుంది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 టీమ్ కూడా ఎన్టీఆర్ కు స్పెషల్ వీడియో తో విషెస్ చెప్పారు.
"అహం బ్రహ్మస్మి " మూవీ లో భారీ యాక్షన్ సీన్
సూపర్ హిట్ "దొంగ దొంగది " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మనోజ్ మంచు "శ్రీ ", "నేను మీకు తెలుసా ?", బిందాస్ ", "వేదం ", కరెంట్ తీగ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఒక్కడు మిగిలాడు "(2017 ) మూవీ తరువాత మనోజ్ మూవీస్ లో నటించలేదు. 3 సంవత్సరాల తరువాత మనోజ్ తన స్వంత బ్యానర్ MM ఆర్ట్స్ పై "అహం బ్రహ్మస్మి " మూవీ లో నటిస్తూ నిర్మిస్తున్నారు.