“ఊహలు గుస గుసలాడే , “జో అచ్యుతానంద “, “ఛలో “, “కణం “, “ఓ బేబీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. హీరో నాగశౌర్య తో జంటగా నటించి టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా , రష్మిక లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించడం విశేషం. నాగశౌర్య స్వంత ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్ పై “ఛలో “, “నర్తనశాల “, “అశ్వథ్థామ” మూవీస్ నిర్మించారు. “అశ్వథ్థామ”మూవీ లో మాస్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగశౌర్య ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రైటర్ , యాక్టర్ నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగశౌర్య హీరోగా మూడు సినిమాలు రూపొందనున్నాయి. దర్శకులు అవసరాల శ్రీనివాస్, సంతోష్ జాగర్లమూడి, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మూవీస్ కు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు తన స్వంత బ్యానర్ పై 4వ సినిమా నిర్మించనున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై హనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. లాక్ డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిన తరువాత ఈ మూవీ అనౌన్స్ కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: