టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు. పెద్ద ఫైట్లు, కమెర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకుండా.. మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో దిట్ట. ‘డాలర్ డ్రీమ్స్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైనా.. ‘ఆనంద్’ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘హ్యాపీడేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ‘లీడర్” వంటి విజయాలను అందుకున్న తర్వాత ‘అనామిక’ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. గత ఏడాది విడుదలైన ‘ఫిదా’ చిత్రంతో మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు శేఖర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక “ఫిదా” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల ఓ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడట. అయితే అది నిజమే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను కూడా ప్రస్తుతం లవ్ స్టోరీ మూవీని తెరకెక్కిస్తున్న ఏషియన్ సునీల్, నారాయణ్ దాస్ నారంగ్ లే నిర్మించనున్నారట. లవ్ స్టోరీ సినిమా అవుట్ పుట్ నచ్చి మరోసారి శేఖర్ కమ్ములతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: