లాక్‌డౌన్‌తో బుల్లితెర, వెండితెర షూటింగ్స్ నుంచి ప్రొడక్షన్, ఇతర కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయాయి. ఒకపక్క పక్క రాష్ట్రాల్లో షూటింగ్ లకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో ఇక్కడ కూడా అనుమతుల కోసం టాలీవుడ్ పెద్దలు ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్.శంకర్, అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ, సీ. కల్యాణ్, సురేష్‌బాబు, కొరటాల శివ తదితరలు ప్రగతిభవన్‌కు వెళ్లి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో చర్చలు జరిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ప్రకటించారు.. లాక్‌డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ.. షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని.. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది.
తక్కువ మందితో.. ఇండోర్‌లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని.. తర్వాత దశలో జూన్ నుండి.. సినిమా షూటింగులు ప్రారంభించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇక థియేటర్ల విషయానికొస్తే.. పరిస్థితులను బట్టి, సినిమా థియేటర్ల తెరవాలా?వద్దా? అన్నది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సీఎం కేసీఆర్..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: