అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’కు ఆరేళ్ళు

Director Vikram Kumar Sensational Blockbuster Manam Completes 6 Years.

ఒకే కుటుంబానికి చెందిన మూడు త‌రాల క‌థానాయ‌కులు ఒకే సినిమాలో క‌ల‌సి న‌టించ‌డం అరుదైన విష‌య‌మనే చెప్పాలి. అలాంటి అరుదైన అంశానికి వేదిక‌గా నిలిచిన చిత్రం ‘మనం’. అక్కినేని మూడు తరాల కథానాయకులైన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ‘కింగ్’ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ మెమ‌ర‌బుల్ మూవీని విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేశాడు. నాగ్‌కి జోడిగా శ్రియాశరన్, చైతూకి జంట‌గా సమంత నటించిన ఈ సినిమాలో శరణ్య, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం, సప్తగిరి, యం.యస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, శంకర్ మేల్కోటే, కృష్ణుడు, గుండు సుదర్శన్ ముఖ్య భూమికలు పోషించగా.. అమల, అఖిల్, అమితాబ్ బచ్చన్, రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠి, నీతూ చంద్ర అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. అక్కినేని వారి హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

చంద్రబోస్, వనమాలి, అనూప్ రూబెన్స్ గీతరచనకు అనూప్ రూబెన్స్ వీనులవిందైన బాణీలు అందించారు. “కనిపెంచిన మా అమ్మకే”, “చిన్ని చిన్ని ఆశలు”, “కనులను తాకే”, “ఇది ప్రేమ”, “పియో పియోరే”.. ఇలా ఇందులోని పాటలన్నీ మెస్మరైజ్ చేశాయి. ‘ఉత్తమ ద్వితీయ చిత్రం’, ‘ఉత్తమ సహాయనటుడు’(నాగచైతన్య), ‘ఉత్తమ అనువాద కళాకారిణి’(చిన్మయి), ‘ఉత్తమ సంగీత దర్శకుడు’(అనూప్ రూబెన్స్) విభాగాల్లో ‘నంది’ని అందుకున్న ‘మనం’.. ‘ఉత్తమ చిత్రం’, ‘ఉత్తమ దర్శకుడు’(విక్రమ్ కె.కుమార్), ‘ఉత్తమ సంగీత దర్శకుడు’(అనూప్ రూబెన్స్), ‘ఉత్తమ ఛాయాగ్రాహకుడు’(పి.యస్.వినోద్), ‘ఉత్తమ గీతరచయిత’(చంద్రబోస్)విభాగాల్లో ‘ఫిలిమ్ ఫేర్ – సౌత్’ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. విశేష‌మేమిటంటే.. నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’(1986) రిలీజైన‌ తేదినే.. త‌న తండ్రి నాగేశ్వ‌ర‌రావు న‌టించిన‌ ఆఖ‌రి చిత్రం ‘మ‌నం’(2014) కూడా విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించడం. 2014 మే 23న విడుదలై ప్రేక్షకులను మురిపించిన ‘మనం’.. నేటితో 6 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here