“చంద్రముఖి 2” మూవీ లో సిమ్రాన్ ?

Versatile Actress Simran To Reprise The Role Of Jyotika In Chandramukhi 2

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి . వాసు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా రూపొందిన కామెడీ హారర్ తమిళ మూవీ “చంద్రముఖి “ఘనవిజయం సాధించింది. ప్రభు , జ్యోతిక, నయనతార ఇతర ముఖ్య తారాగణం. 2005 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “చంద్రముఖి ” కూడా ఘనవిజయం సాధించింది. “చంద్రముఖి” మూవీ లో గంగ, చంద్రముఖి పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జ్యోతిక బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై పి . వాసు దర్శకత్వంలో నటుడు, కొరియోగ్రాఫర్ , నిర్మాత , దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా “చంద్రముఖి 2” మూవీ రూపొందనుంది. రజనీకాంత్ పాత్రలో లారెన్స్ ఎంపిక అయ్యారు. జ్యోతిక పాత్రలో తెలుగు, తమిళ భాషలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఎంపిక అయ్యారని సమాచారం. దర్శకుడు వాసు , లారెన్స్ కాంబినేషన్ లో “శివలింగ ” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన “లక్ష్మీబాంబ్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =