
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 184


మా మధ్య ఎలాంటి సంబంధం లేదు..!
ఆన్ లైన్ కోర్సులతో కాజల్
మళ్ళీ 'చందమామే' అంటున్న తేజ..!
టాలీవుడ్ , బాలీవుడ్ లలో బిజీ
తెలంగాణ యాసలో నాని..!

కిల్లర్ తరహా పాత్రలో రవితేజ?
జులై రెండో వారం నుంచి పవన్, క్రిష్ చిత్రం?

తన లవ్ స్టోరీ గురించి చెప్పిన రానా...!

నాకు టైమ్ ఉందిలే.. రానా, నితిన్ ఏం చేశారు...!
బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ప్రభాస్ మూవీ

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని మూవీ
మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ మృతి
ఆలోచన రేకెత్తించే రష్మిక పోస్ట్

హ్యాపీ బర్త్ డే మామయ్య..!

3 మూవీస్ సీక్వెల్స్ కు స్క్రిప్ట్స్ రెడీ -గౌతమ్ మీనన్
బ్లాక్ బస్టర్ "మిన్నలే "తమిళ మూవీ తో దర్శకుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ పలు సూపర్ డూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వం వహించారు. "ఘర్షణ ", "ఏ మాయ చేసావె ", "ఎటో వెళ్ళిపోయింది మనసు ", "సాహసం శ్వాస గా సాగిపో " వంటి మూవీస్ తో గౌతమ్ తెలుగుప్రేక్షకులకు పరిచయమే. "ఏ మాయ చేసావె " మూవీ కి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా గౌతమ్ మీనన్ నంది అవార్డ్ అందుకున్నారు.

మా మధ్య ఎలాంటి సంబంధం లేదు..!
విలక్షణ నటుడు.. నటనను నేర్చుకోవాలని వచ్చే హీరోలకు ఆయన సినిమాలు ఒక లైబ్రరీ లాంటివి. ఇక కమల్ సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన పర్సనల్ లైఫ్ కు వస్తే మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. మొదట సారికను వివాహమాడిన కమల్ ఆ తర్వాత ఆమెతో విడిపోయారు. ఆ తర్వాత గౌతమితో కూడా చాలా కాలం పాటు కలిసే ఉన్నాడు కమల్. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. హీరోయిన్ గౌతమితో విడిపోయాక ఆయన మరో నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అంతేకాకుండా పూజా కుమార్ తరచుగా కమల్ హాసన్ ఫ్యామిలీ ఫంక్షన్‌లకు హాజరవుతుండటం, వారి కుటుంబ సభ్యురాలిగా మెలుగుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం…
పుష్ప సినిమాలో 'స్టార్ యాంకర్'.. అన్నీ రూమర్సే..!
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. లాక్ డౌన్ అయిపోగానే షూటింగ్ ను ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమాను మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్నారు. విదేశాల్లో షూటింగ్ లు లేవు.. అక్కడి టెక్నేషియన్స్ ఇక్కడికి రావడానికి ఛాన్స్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే సగానికి పైగా పాటలను పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ కోర్సులతో కాజల్
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ 13 సంవత్సరాలుగా టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ ప్రస్తుతం తెలుగు లో "ఆచార్య ", "మోసగాళ్ళు "మూవీస్, తమిళ భాషలో రెండు సినిమాలు, హిందీ లో "ముంబై సాగ " మూవీ లో నటిస్తున్నారు.
మళ్ళీ 'చందమామే' అంటున్న తేజ..!
'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఆ తర్వాత సీత సినిమాను తీసినా అది పెద్దగా విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఎప్పుడో ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’రానా నటిస్తుండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు.
టాలీవుడ్ , బాలీవుడ్ లలో బిజీ
"దువ్వాడ జగన్నాథం ", "అరవింద సమేత వీర రాఘవ ", "మహర్షి ", "గద్దలకొండ గణేష్ ", "అల .. వైకుంఠపురము లో.. " వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న పూజాహెగ్డే హిందీ లో నటించిన "హౌస్ ఫుల్ 4 "మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "Prabhas 20 మూవీలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.
తెలంగాణ యాసలో నాని..!
వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ బిజీ అవ్వనున్నాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక్కసారి లాక్ డౌన్ కనుక తీసేస్తే షూటింగ్ లతో బిజీ కానున్నాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేసాడు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా లాక్ డౌన్ వల్ల ఆగింది. ఆ సినిమా చేస్తూనే నానితో ‘నిన్ను కోరి ' తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రీతూవర్మ తో పాటు మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఆతర్వాత 'టాక్సీవాలా' సినిమా…
'నో పెళ్లి' అంటున్న సాయి తేజ్.. నేనూ చూస్తా అంటున్న నితిన్..!
సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉండగా లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. లేకపోతే అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కారణం తెలిసిందే కదా..

కిల్లర్ తరహా పాత్రలో రవితేజ?
'వీర'(2011) తరువాత మాస్ మహరాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో 'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్‌గా నటించనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది.

రెబల్ స్టార్ కృష్ణంరాజు సెన్సేషనల్ మూవీ ‘బొబ్బిలి బ్రహ్మన్న’కు 36 ఏళ్ళు
రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఒకటి. కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శారద, జయసుధ నాయికలుగా నటించారు. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్‌ప్రసాద్, రాజేష్, ముచ్చర్ల అరుణ, అన్నపూర్ణ, కృష్ణవేణి ముఖ్య భూమికలు పోషించారు.

శ్రీకాంత్ కెరీర్‌ను మేలిమలుపు తిప్పిన చిత్రం ‘తాజ్‌మహల్’కు 25 ఏళ్ళు
నిన్నటితరం కథానాయకుడు శ్రీకాంత్ కెరీర్‌లో పలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. వాటిలో శ్రీకాంత్ కెరీర్‌ను మేలిమలుపు తిప్పిన ‘తాజ్‌మహల్’ ఒకటి. శ్రీకాంత్‌కి సోలో హీరోగా తొలి విజయాన్ని అందించిన సినిమా ఇదే కావడం విశేషం. మోనికా బేడి, సంఘవి నాయికలుగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాసరావు, నూతన్‌ప్రసాద్, బ్రహ్మానందం, బాబుమోహన్, సుధాకర్, మల్లికార్జునరావు, అచ్యుత్, సుధ ముఖ్య భూమికలు పోషించారు. ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు.
జులై రెండో వారం నుంచి పవన్, క్రిష్ చిత్రం?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఓ పిరియాడిక్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి.. కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ పరంగా బ్రేక్ పడింది.

నిశ్శబ్దం ఫస్ట్ ఛాయస్ థియేటర్.. కానీ పక్షంలో ఓటీటీ..!
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం 'నిశ్శబ్దం'. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

తన లవ్ స్టోరీ గురించి చెప్పిన రానా...!
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లిస్ట్ లో ఒకప్పుడు మొదట వినిపించిన పేరు రానా. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ నుండి బయటకి వచ్చేశాడు. సోషల్ మీడియా లో తన ప్రేమను బయట పెట్టడం.. చెప్పిన కొద్దీ రోజులకే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకోవడం అన్నీ చక చకా జరిగిపోయాయి. అయితే వీరి ఎంగేజ్ మెంట్ అయినా కూడా అసలు రానా-మిహికా ల మధ్య ప్రేమ ఎలా స్టార్ట్ అయింది అన్న విషయాల్లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు చాలా మందికి. ఎందుకంటే రానా ఏమో హీరో, మిహికా ఏమో ముంబైలో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్, డెకరేషన్ సంస్థను నడుపుతోంది.మరి వీరిద్దరి ప్రేమ ఎలా మొదలైంది విషయాలు రానానే చెప్పాడు .

నాకు టైమ్ ఉందిలే.. రానా, నితిన్ ఏం చేశారు...!
మెగా హీరోలు సాయి తేజ్, వరుణ్ తేజ్ ల ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్దిరోజుల కిందట నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో నిహారిక, వరుణ్ పెళ్లిళ్ల గురించి చెప్పిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని.. ఆ తర్వాత వరుణ్ పెళ్లి కూడా తొందరలోనే చేస్తామని.. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నా భాద్యత అయిపోతుంది.. వచ్చే వాళ్ళను వాళ్ళని చుస్కుకుంటారు అని చెప్పారు. ఇక వీడియో ను సాయి తేజ్ ఇప్పుడు చూసాడేమో కానీ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ఏంటి బావ నీకు పెళ్ళంటా? అని తేజ్, వరుణ్ ని అడిగాడు.
బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ప్రభాస్ మూవీ
వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ హీరోగా రూపొందిన "బాహుబలి" ,"బాహుబలి 2" , "సాహో " మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి. ఈ మూవీస్ తో బాలీవుడ్ లో ప్రభాస్ మూవీస్ పై క్రేజ్ పెరిగింది. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని మూవీ
హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత "టాక్సీవాలా " మూవీ ఫేమ్ రాహుల్, "బ్రోచేవారెవరురా " మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించే చిత్రాలలో నాని నటించనున్నారు. నాని ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ మృతి
ఈరోజు ఉదయమే సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హరికిషన్ మరణం పట్ల టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది.
ఆలోచన రేకెత్తించే రష్మిక పోస్ట్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక ఆలోచన రేకెత్తించే ఒక పోస్ట్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

హ్యాపీ బర్త్ డే మామయ్య..!
కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. కమర్షియల్ సినిమాలే కాదు భక్తిరస సినిమాలు తీయడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. మేకింగ్లో వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరూ కే.రాఘవేంద్రరావు. ఇక తెలుగులో ఎన్నో సంచలనాలు సృష్టించిన రాఘవేంద్రరావు పుట్టిన రోజు ఈ రోజు. దీనితో టాలీవుడ్ నుండి పలువురు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.