నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’కు 34 ఏళ్ళు

Akkineni Nagarjuna Debut Movie Vikram Completes 34 Years.

ఒక మహానటుడు తనయుడు కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్నాడంటే.. ఆ అంచనాలు భారీగా ఉంటాయి. అందునా.. ఆ కథానాయకుడు నటించబోయే సినిమా.. పరభాషలో ఘనవిజయం సాధించిన చిత్రమైతే.. ఇక ఆ అంచనాలకు ఆకాశమే హద్దు. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగా తొలిచిత్రంతోనే మరపురాని విజయాన్ని అందుకుని.. అంచెలంచెలుగా ఎదిగి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఆ కథానాయకుడు. అతను మరెవరో కాదు.. ‘కింగ్’ నాగార్జున. ఆ చిత్రమే.. ‘విక్రమ్’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్కినేని నాగేశ్వరరావు క‌థానాయ‌కుడిగా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దిగ్గజ దర్శకులు వి.మధుసూదనరావు ‘విక్రమ్’ను రూపొందించారు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘హీరో’ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఇందులో నాగ్‌కి జోడిగా శోభన నటించింది. కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్, సుధాకర్, కాంతారావు, ‘ఆహుతి’ ప్రసాద్, సూర్య, అన్నపూర్ణ, రమాప్రభ, రాజ్యలక్ష్మి, పుష్పలత, అనురాధ, మాణిక్ ఇరాని, మాస్టర్ సురేష్ ముఖ్య భూమికలు పోషించారు.

దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. “నీవేలే నా ప్రాణం”, “నీవే రాగం”, “కొండ కోనల్లో”, “ఓ కాలమా”, “డింగ్ డాంగ్”, “సలామిదిగో”.. ఇలా ఇందులోని ప్రతీ పాట అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వెంకట్ అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 1986 మే 23న విడుదలైన ‘విక్రమ్’.. నేటితో 34 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =