టాలీవుడ్ తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు

Mega Star Chiranjeevi Thanks Telangana Chief Minister K Chandrashekhar Rao On Behalf Of Tollywood Film Industry

సినిమా షూటింగ్స్ అనుమతుల గురించి చర్చించేందుకు గాను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ లో సినీపెద్దలు కేసీఆర్ తో పలు విషయాలపై మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా సీఎం జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చిని చెప్పినట్టు సమాచారం. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని..షూటింగ్ లోకేషన్స్‌లో లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాలని, లోకేషన్‌ను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని కేసీఆర్‌ సూచించినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో స్పందిస్తూ కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.సినిమా, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాలకు సంబంధించిన సమస్యలపై సానుకూల ధోరణితో విన్నారని, వేలమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారని చిరంజీవి వివరించారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందిస్తుందని, అందరికీ మేలు కలిగేలా చూస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వెల్లడించారు.

ఇక నిన్న మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు టాలీవుడ్ ప్రముఖనిర్మాతలు, డైరెక్టర్స్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశంలో సినిమాల షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి చర్చించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకోవడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =