మహేష్‌ బాబుకి ‘ఉత్త‌మ న‌టుడు’గా తొలి ‘నంది’ని అందించిన ‘నిజం’కి 17 ఏళ్ళు

Super Star Mahesh Babu First Nandi Award Winning Movie Nizam Completes 17 Years.

తెలుగునాట ప్రయోగాలకు పెద్ద పీట వేసే కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అలా మహేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రాలకు సంబంధించి జయాపజయాలను పక్కన పెడితే.. కొన్ని చిత్రాలు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలా.. ప్రశంసలు అందుకున్న చిత్రాల్లో ‘నిజం’ ఒక‌టి. ‘యాంటి కరప్షన్’ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంచలన దర్శకుడు తేజ రూపొందించాడు. ఇందులో రక్షిత క‌థానాయిక‌గా న‌టించ‌గా గోపీచంద్, రాశి, ‘తాళ్ళూరి’ రామేశ్వరి, ప్రకాష్‌రాజ్, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, జీవా, కాంతారావు, విజయచందర్, రాళ్ళపల్లి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, షకీలా, సుమన్ శెట్టి, మణిచందన ముఖ్య పాత్రలు పోషించారు.

కులశేఖర్ కలం నుంచి జాలువారిన పాటలకు ఆర్.పి.పట్నాయక్ అల‌రించే బాణీలు అందించాడు. “నీలో ఉన్నది”, “ఛీ ఛీ అంటే”, “రత్తాలు రత్తాలు”, “ఇలాగే ఇలాగే”, “కాకులు దూరని”, “చరచర”, “చందమామ రావే”.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతోనే తన కెరీర్‌లో తొలిసారి ‘ఉత్త‌మ నటుడు’ విభాగంలో ‘నంది’ పురస్కారాన్ని అందుకున్నాడు మహేష్. అంతేకాదు.. ‘ఉత్తమ సహాయనటి’గాను ‘తాళ్ళూరి’ రామేశ్వరి కూడా ‘నంది’ని కైవసం చేసుకోవడం విశేషం. చిత్రం మూవీస్ పతాకంపై తేజ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఒడియాలో ‘అర్జున’ పేరుతోనూ, బంగ్లాదేశ్‌లో ‘టాప్ లీడర్’ టైటిల్‌తోనూ ఈ సినిమాని రీమేక్ చేశారు. 2003 మే 23న విడుద‌లైన ‘నిజం’.. నేటితో 17 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here