మహేష్-గౌతమ్ ల హైట్ చెక్..!

Mahesh Babu Having Fun with his Son Gautam
Mahesh Babu Having Fun with his Son Gautam

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటాడు.తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు మహేష్. అలాంటిది ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటూ సితార, గౌతమ్ లతో కలిసి ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక వారికి సంబంధించిన క్యూట్ మూవ్ మెంట్స్ ను ఎప్పటికప్పుడు వీడియోలో బంధించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు నమ్రత, మహేష్. ఇక ఇప్పటి వరకూ పలు వీడియోలు పోస్ట్ చేయగా ఇప్పుడు తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. మొన్న ‘బ్లింక్ అండ్ యు లాస్’ అనే గేమ్ ఆడిన గౌతమ్- ఈసారి హైట్ చెక్ చేసుకుంటున్నారు. కొడుకుతో మహేశ్ హైట్ చెక్ చేసుకున్నారు. అయితే మహేశ్ కంటే గౌతమ్ కాస్త తక్కువ హైట్ ఉన్నాడు. మరి ఇప్పుడే ఇంత హైట్ ఉన్నాడంటే.. ఇంకా ఎదిగే వయసు వుంది కాబట్టి గౌతమ్ మహేష్ కంటే ఎక్కువ హైటే పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ వీడియో మహేష్ బాబు పోస్ట్ చేయగా… ప్రస్తుతం ఈ వీడియో ఎంతో వైరల్ అవుతోంది.

 

 

View this post on Instagram

 

Height check!! He’s tall♥️♥️ #LockdownShenanigans

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

మహేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి తర్వాత ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో సెన్సషనల్ హిట్ అందుకున్నాడు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మహేష్ బాబు…పరశురామ్ సినిమా ప్రారంభం అవుతుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here