ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల.. త్వరలో ‘లవ్ స్టోరీ’తో పలకరించనున్నాడు. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా.. చిత్రీకరణ తుదిదశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, తాజాగా తన తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు శేఖర్ కమ్ముల. ‘లవ్ స్టోరీ’ని నిర్మిస్తున్న ఏషియన్ ఫిలిమ్స్ సంస్థే తన నెక్స్ట్ వెంచర్‌ని కూడా ప్రొడ్యూస్ చేయనుందని, ఓ అగ్ర యువ కథానాయకుడితో ఈ సినిమా రూపొందనుందని చెప్పుకొచ్చాడు శేఖర్. అంతేకాదు.. రోమ్ – కామ్ (రొమాంటిక్ కామెడీ)గా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయిందని, శరవేగంగా ఈ సినిమాని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపాడు శేఖర్ కమ్ముల.
మరి.. రాబోయే చిత్రాలతోనూ శేఖర్ కమ్ముల విజయపరంపరను కొనసాగిస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: