ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ గుండెపోటుతో మృతి చెందారు. చెనై అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్‌గా పనిచేస్తున్న అభినయ్ నిద్రలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు చెపుతున్నారు. తన ప్యాలెస్ పనుల నిమిత్తం నిన్న చెంగల్పట్టుకు వెళ్లి..అక్కడ కుటుంబంతో సరదాగా గడిపాడని..ఉదయం కల్లా ఇంత ఘోరం జరిగిందని సన్నిహితులు తెలిపుతున్నారు. చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా అభినయ్ భార్య కూడా వైద్యురాలు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వాణిశ్రీకి కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. ఇక కుమారుడు హఠాన్మరణంతో వాణిశ్రీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: