కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 179

సినిమా వార్తలు

బాధ్యత ఉండక్కర్లా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాల గురించే కాదు.. సమాజంలో జరిగే పరిస్థితులపై కూడా స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా పలు అభిప్రాయాలతో పాటు.. సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటారు. ఇప్పటికే కరోనా పై ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా పలు ట్వీట్ లు చేశారు. ఇక ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరోసారి మహేష్ బాబు తన అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బెస్ట్ ఫ్రెండ్స్

ఇద్దరు ట్యాలెంటెడ్ హీరోయిన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండడం అరుదుగా జరుగుతుంది. స్టార్ హీరోయిన్స్ తమన్నా , శృతి హాసన్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. శృతి హాసన్ అంటే తనకెంత ఇష్టమో పలు సందర్భాలలో తమన్నా చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన తమన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో శృతి హాసన్ తో తనకున్న అనుబంధం గురించి తెలిపారు.

Team TFNవాట్సాప్
Prabhu Deva and Nayanthara Starrer Karruppu Raja Vellai Raja Movie Has Been Shelved Says Movie Producer
సినిమా వార్తలు

ప్రభుదేవా-నయనతార సినిమా క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

ప్రభుదేవా-నయనతార ఈ కాంబినేషన్ పై అప్పుడెప్పుడో వాళ్ళు ప్రేమలో వున్నప్పుడు వార్తలు వచ్చాయి. మళ్ళీ ఇన్నేళ్లకు వీరిద్దరి పేర్లు వార్తల్లో నిలిచాయి. అయితే ఈ సారి విషయం వేరే అనుకోండి. ఇంతకీ వీరిద్దరి పేర్లు వార్తల్లో రావడానికి కారణం ఏంటబ్బా అనే కదా డౌట్ .. అసలు విషయం తెలుసుకోవాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు హర్ట్ .. 'ఆచార్య' ను ఆగష్ట్ కు వాయిదా..!

అదేంటి.. మెగాస్టార్ చిరంజీవి ఇంతకీ ఈ విషయంలో హర్ట్ అయ్యరబ్బా అనుకుంటున్నారా.. అసలుసంగతేంటంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మొన్న జరిగిన బాలయ్య వివాదం వలన చిరు బాగానే నోచుకున్నారట. షూటింగ్‌ల అనుమతుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ చర్చలపై బాలకృష్ణ స్పందించి.. నన్ను ఈ మీటింగ్స్‌కు ఎవరూ పిలవలేదు.. అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అంతేకాదు భూములు పంచుకుంటున్నారా అంటూ పలు సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇక ఈ వివాదంపై పలువురు పలు రకాలుగా స్పందించినా.. చిరు మాత్రం హర్ట్ అయ్యాడట. అందుకే ఇకపై షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్‌కు సంబంధించి…

TFN Adminవాట్సాప్
చిరు కోసం 'ఉప్పెన' స్పెషల్ స్క్రీనింగ్..!
సినిమా వార్తలు

చిరు కోసం 'ఉప్పెన' స్పెషల్ స్క్రీనింగ్..!

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది. దీనితో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే ప్రభాస్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నా..!

ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా... కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక లాక్ డౌన్ తీసేసినా విదేశాలు వెళ్లడం కష్టమే కాబట్టి ఇక్కడే షూట్ ను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు తాను ఈ సినిమాలో నటించడానికి గల కారణం ఏంటో తెలిపింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మోక్షజ్ఞ ఎంట్రీ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్

నందమూరి , అక్కినేని , సూపర్ స్టార్ కృష్ణ , మెగా స్టార్ చిరంజీవి వారసులు టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కై నందమూరి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ 5సంవత్సరాలుగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి గానీ సెట్ కాలేదు. తన వారసుడి టాలీవుడ్ ఎంట్రీ పై బాలకృష్ణ క్లారిఫై చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డాక్టర్ తో 'సాహూ' డైరెక్టర్ పెళ్లి..!

మొత్తానికి టాలీవుడ్ లో ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. కరోనా ఉన్నా కూడా నిబంధలను పాటిస్తూ సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక రానా కూడా తన ప్రేమను అందరికీ పరిచయం చేయడం... వెంటనే నిశితార్థం. త్వరలోనే పెళ్లి కూడా జరగనుంది. ఆగష్ట్ 8వ తేదీన రానా పెళ్లి జరగనుంది. ఇంకా నితిన్ పెళ్లి ఒక్కటి మిగిలింది. మరి నితిన్ కూడా కొద్దిరోజులు ఆగుతాడో.. నిబంధలను పాటిస్తూ చిన్నగా కానిస్తాడో చూడాలి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లెజెండరీ రైటర్ సోషల్ మీడియా ఎంట్రీ

1984 సంవత్సరం "జననీ జన్మభూమి "మూవీ తో గీత రచయితగా టాలీవుడ్ కు పరిచయం అయిన చెంబోలు సీతారామశాస్త్రి "సిరివెన్నెల "మూవీ కి గీత రచయిత గా పని చేసి ఆ మూవీ లోని అన్ని సాంగ్స్ ను రచించారు. ఆ మూవీ లోని "విధాత తలపున " సాంగ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఆ మూవీ పేరే ఆయనకు ఇంటి పేరుగా మారింది. పలు మూవీస్ కు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన సిరివెన్నెల బెస్ట్ లిరిసిస్ట్ గా 11 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మచ్చలేని "చందమామ "

13 సంవత్సరాలుగా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి తెలుగు , తమిళ ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త కోర్సులు నేర్చుకొంటూ, బుక్స్ చదువుతూ, వంట చేస్తూ కాజల్ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Suresh Productions Team Greets Birthday Wishes To Actress Priyamani On Twitter
సినిమా వార్తలు

టాలెంటెడ్ నటి ప్రియమణి కి హ్యాపీ బర్త్ డే

ఈరోజు ప్రియమణి పుట్టినరోజు కావడంతో విరాట పర్వం నుండి తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ప్రియమణి సురేష్ ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న నారప్ప సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ప్రియమణి బర్త్ డే సందర్భంగా నారప్ప సినిమాలోని ప్రియమణి లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. టాలెంటెడ్ నటి ప్రియమణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఈ ఏడాది మొత్తం అనేక విజయాలు దక్కాలని కోరుకుంటున్నామని తెలిపారు.

TFN Adminవాట్సాప్
Stylish Star Allu Arjun Thanks Entire Crew Of Vedam On Completing 10 Years Of Movie Release
సినిమా వార్తలు

పదేళ్ల 'వేదం'.. ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు..!

క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, మనోజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మల్టీస్టారర్ సినిమా 'వేదం'. 2010లో వచ్చిన ఈ సినిమా ప్రశంసకుల విమర్శలు సైతం దక్కించుకుంది. కేబుల్ ఆపరేటర్ గా.. మనిషిగా పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని భావించే అల్లు అర్జున్ నటన అటు కామెడీగానే వుంటూ ఆకట్టుకుంటుంది. గొప్పింటి అబ్బాయిలా ఉండటానికి.. కనిపించడానికి అల్లు అర్జున్ పడే తాపత్రయం అటు నవ్విస్తూనే.. ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ఇక వేశ్య వృత్తిలో ఎన్ని ఇబ్బందులున్నాయి...వారి జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది అన్న విషయాలు అనుష్క‌ పాత్ర ద్వారా చూపాడు దర్శకుడు. పాప్ స్టార్ కావాల‌నుకునే యువ‌కుడి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తండ్రీ కొడుకులు హీరోలుగా #VIKRAM 60 మూవీ

ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకొని నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం "కోబ్రా ", "మహావీర్ కర్ణ ", "పొన్నియిన్ సెల్వన్ " మూవీస్ లోన్ నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ ఇప్పుడు తన 60 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ముట్టుకుంటే .. బ్లాస్ట్ !

సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం " మూవీ తో ప్రేక్షకులను అలరించిన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "A 1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ "చావు కబురు చల్లగా " మూవీ లో హీరోయిన్ గా లావణ్య నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన లావణ్య సోషల్ మీడియా లో తరచూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Veteran Producer Ambika Krishna To Make A Movie With Nandamuri Balakrishna
సినిమా వార్తలు

బాలకృష్ణ తో సీనియర్ నిర్మాత సినిమా..!

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "#NTR30" మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ "KGF చాప్టర్ 1" కన్నడ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుందనే వార్తలు చాలా కాలం గా వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు రష్మిక ప్రశ్న ఎలాంటి పాత్రలు చేయాలి..?

లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా కు చాలా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలోకాస్త తక్కువ గడిపేవాళ్ళు బాగా యాక్టీవ్ అవుతున్నారు. అసలు అకౌంట్స్ లేనివాళ్లు కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎలాగు షూటింగ్స్, సినిమాలు లేవు కాబట్టి ఈ రకంగా అయినా ఫ్యాన్స్ కు దగ్గరగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తరచుగా ముచ్చటిస్తూనే ఉంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'విరాటపర్వం' - 'కామ్రేడ్ భారతక్క' గా ప్రియమణి

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఎలాగూ ఈ నెల నుండి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నారు కాబట్టి షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి సాయి పల్లవి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియమణి ఫస్ట్ లుక్ ను కూడా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"పుష్ప " మూవీ లో రోజా నెగటివ్ రోల్ ?

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో "పుష్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో ఒక నెగటివ్ రోల్ కై సీనియర్ హీరోయిన్ , MLA రోజా ను చిత్ర యూనిట్ సంప్రదిస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"అలివేలు వెంకటరమణ " మూవీ లో హీరోయిన్ రకుల్ ?

తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడు గా "అలివేలు వెంకటరమణ " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా సాయి పల్లవి గానీ , రకుల్ ప్రీత్ ను గానీ ఎంపిక చేయాలని దర్శకుడు తేజ ప్లాన్ చేశారు. సాయి పల్లవి పలు మూవీస్ లో బిజీగా ఉండడంతో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడం బెటర్ అని తేజ భావిస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు గోపీచంద్, రకుల్ జంటగా రూపొందిన "లౌక్యం "మూవీ ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్

షేర్