టాలెంటెడ్ నటి ప్రియమణి కి హ్యాపీ బర్త్ డే

Suresh Productions Team Greets Birthday Wishes To Actress Priyamani On Twitter
Suresh Productions Team Greets Birthday Wishes To Actress Priyamani On Twitter

ఈరోజు ప్రియమణి పుట్టినరోజు కావడంతో విరాట పర్వం నుండి తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ప్రియమణి సురేష్ ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న నారప్ప సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ప్రియమణి బర్త్ డే సందర్భంగా నారప్ప సినిమాలోని ప్రియమణి లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. టాలెంటెడ్ నటి ప్రియమణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఈ ఏడాది మొత్తం అనేక విజయాలు దక్కాలని కోరుకుంటున్నామని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ప్రియమణి సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు 15 ఏళ్లు అవుతుంది. తెలుగులో ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసినా.. ‘పెళ్ళైనకొత్తలో సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. 2006లో ఆమె నటించిన పరుత్తివీరన్ సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమనటి పురస్కారం అందుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ పలు ఇలా భాషా చిత్రాల్లో ఆమె నటించింది.

ఈ మధ్య సినిమాలకు దూరమవ్వగా పలు టీవీ ప్రోగ్రామ్స్ లో జడ్జిగా వ్యవరిస్తుంది. వాటితో పాటు ఫ్యామిలీ మాన్ సిరీస్ లో నటించింది. ఇంకా తెలుగులో విరాటపర్వం, నారప్ప సినిమాలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =