బాధ్యత ఉండక్కర్లా..!

Super Star Mahesh Babu Urges Everyone To Protect The Nature On The Occasion Of World Environment Day
Super Star Mahesh Babu Urges Everyone To Protect The Nature On The Occasion Of World Environment Day

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాల గురించే కాదు.. సమాజంలో జరిగే పరిస్థితులపై కూడా స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా పలు అభిప్రాయాలతో పాటు.. సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటారు. ఇప్పటికే కరోనా పై ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా పలు ట్వీట్ లు చేశారు. ఇక ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరోసారి మహేష్ బాబు తన అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చాడు.

తన ట్విట్టర్ లో మహేష్ బాబు దలైలామ కొటేషన్‌ను షేర్ చేశారు. దాని అర్ధం ‘మనమందరం నివసించే పర్యావరణాన్ని పరిరక్షించడం.. మనందరి, వ్యక్తిగత బాధ్యత. ప్రకృతి, మనము ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాము. ప్రకృతిని రక్షించడం ద్వారా మనల్ని మనం రక్షించుకుంటాము. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సవాళ్లు మానవ జీవితపు దుర్బలత్వాన్ని ప్రకటిస్తున్నాయి. మనందరం సంతోషంగా జీవించాలంటే, ఆరోగ్యకరమైన మరియు సమతుల్య పర్యావరణ వ్యవస్థను సృష్టించడం చాలా ముఖ్యం. మనమందరం ఇంట్లో సురక్షితంగా ఉంటూ మన గొంతుకను ప్రపంచానికి వినిపించాలి. మన చేసే పనులు, మాటలు మారాల్సి ఉంది. భవిష్యత్తు మనపై ఆధారపడి ఉంది. నీటిని ఆదా చేయండి, చెట్లను కాపాడండి, విద్యుత్తును ఆదా చేయండి, కార్బన్ వాడకలను తగ్గించుకుందాం, అడవులను, మన మహాసముద్రాలను, జంతువులను రక్షించుకుందాం.. మీకు ముఖ్యమైనది ఏమిటో ఎంచుకోండి! ఈ రోజు ప్రారంభించండి! దీన్ని కలిసి చేద్దామ’ని పిలుపునిచ్చాడు.


మరి నిజంగానే గతకొద్ది రోజులుగా ప్రకృతి కనుక పగపడితే ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. ఒక పక్క కరోనా.. మరోపక్క తుఫానులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మనుషులని అతలాకుతలం చేస్తుంది. మరి ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన భాద్యత నిజంగా ఉంది.

కాగా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా లైన్ లో ఉంది. రీసెంట్ గానే ఈ సినిమాగానే టైటిల్ ను ప్రీ లుక్ ను విడుదల చేశారు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here