లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా కు చాలా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలోకాస్త తక్కువ గడిపేవాళ్ళు బాగా యాక్టీవ్ అవుతున్నారు. అసలు అకౌంట్స్ లేనివాళ్లు కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎలాగు షూటింగ్స్, సినిమాలు లేవు కాబట్టి ఈ రకంగా అయినా ఫ్యాన్స్ కు దగ్గరగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తరచుగా ముచ్చటిస్తూనే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తనకు సరిపోయే ఓ కొత్త పేరును సూచించాలని ఇటీవల రష్మిక ట్విటర్ ద్వారా ఫ్యాన్స్ ను కోరగా.. ఇప్పుడు తాజాగా మరో ప్రశ్నను ఫ్యాన్స్ ను అడిగింది. అదేంటంటే. `ఫ్యూచర్ లో నన్ను ఎలాంటి సినిమాల్లో, పాత్రల్లో చూడాలనుకుంటున్నారు… చాలా క్యూరియస్ గా ఉన్నా. త్వరగా సమాధానాలు చెప్పండి` అని రష్మిక ట్వీట్ చేసింది. ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. రష్మిక అలా ట్వీట్ చేసిందో లేదో వెంటనే తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొంతమంది `డియర్ కామ్రేడ్`లోని లిల్లీ, `గీతగోవిందం`లోని `గీత` వంటి పాత్రలు మరొకసారి చేయాలని కోరితే.. కొంతమంది `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాలోని సమంత పాత్ర చాలా చిలిపిగా ఉంటుందని, అలాంటి పాత్ర చేయమని..`రాజీ` సినిమాలోని ఆలియా భట్ పాత్రలాంటిది చేయాలని.. బార్బిడాల్ లా ఉంటావు డిస్నీ మూవీస్ లో చేయమని మరొకరు సమాధానమిచ్చారు.
What kind of movies and characters do you want to see me in and as in the future?😉 I am curious. Give me a reference – best! 🐒
— Rashmika Mandanna (@iamRashmika) June 2, 2020
కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. దీనికి కారణం తాను చేస్తున్న పాత్రలు కూడా ఒక కారణం అని కూడా చెప్పొచ్చు. ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా రష్మిక పాత్ర హైలైట్ అని చెపుతున్నారు. చూద్దాం మరి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: