బెస్ట్ ఫ్రెండ్స్

Tollywood Actress Tamannaah Is All Praises For Her Best Friend Shruti Haasan

ఇద్దరు ట్యాలెంటెడ్ హీరోయిన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండడం అరుదుగా జరుగుతుంది. స్టార్ హీరోయిన్స్ తమన్నా , శృతి హాసన్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. శృతి హాసన్ అంటే తనకెంత ఇష్టమో పలు సందర్భాలలో తమన్నా చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన తమన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో శృతి హాసన్ తో తనకున్న అనుబంధం గురించి తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిల్కీ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో శృతి హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని , తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ముంబై లోని తమ ఇంటి దగ్గరే శృతి హాసన్ కుటుంబం ఉండేదని, తామిద్దరూ తరుచూ కలుసుకునే వాళ్ళమని , కలిసినప్పుడల్లా తమ జీవితాల గురించి మాట్లాడుకునే వాళ్ళమని , ముఖ్యంగా శృతి కి నెగిటివిటీ అంటే ఇష్టముండదని, శృతి లోని ఆ గొప్పగుణమే తామిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావడానికి కారణం అయ్యిందని, శృతి తనను ఇప్పటికీ చిన్న పిల్లలా ట్రీట్ చేస్తుందని తమన్నా చెప్పారు. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “, రవితేజ హీరోగా రూపొందుతున్న “క్రాక్ ” మూవీలో శృతి హాసన్ నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − three =