‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఎలాగూ ఈ నెల నుండి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నారు కాబట్టి షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి సాయి పల్లవి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియమణి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇవాళ ప్రియమణి బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం అంటూ హీరో రానా ట్వీట్ చేశారు.
మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం.#HappyBirthdayPriyamani pic.twitter.com/aUOOR3kJYD
— Rana Daggubati (@RanaDaggubati) June 4, 2020



కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫిగా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























