బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఆ రోజున సింపుల్ గా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారట. ఆ తరువాత రెగ్యులర్ షూటింగుకు వెళతారట.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో నిర్మాత బాలకృష్ణ తో సినిమా చేయనున్నట్టు తెలిపారు. ఆయనెవరో కాదు వెటరన్ ప్రొడ్యూసర్ తాజాగా మీడియాతో ముచ్చటించిన అంబికా కృష్ణ.. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 10కి పైగా సినిమాలు నిర్మించాను. నాకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. ఆయన మనసు చాలా గొప్పది. ఆయన సమస్యలపై స్పందించే విధానం గొప్పగా ఉంటుంది. నాకు మంచి స్నేహితుడని తెలిపారు. అంతేకాదు త్వరలోనే బాలకృష్ణ తో సినిమా నిర్మించనున్నట్టు తెలిపారు. అయితే సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటపెట్టలేదు. గతంలో బాలకృష్ణతో వీరభద్ర సినిమాను నిర్మించారు అంబికా కృష్ణ. మరి బోయపాటి, గోపాల్ తో సినిమాలు అయిపోయిన తర్వాత ఈ సినిమా ఉంటుందేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: