నందమూరి , అక్కినేని , సూపర్ స్టార్ కృష్ణ , మెగా స్టార్ చిరంజీవి వారసులు టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కై నందమూరి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ 5సంవత్సరాలుగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి గానీ సెట్ కాలేదు. తన వారసుడి టాలీవుడ్ ఎంట్రీ పై బాలకృష్ణ క్లారిఫై చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలకృష్ణ మాట్లాడుతూ .. తన తనయుడు మోక్షజ్ఞ సినిమాలలో నటించడానికి ఆసక్తితో ఉన్నాడని , తప్పని సరిగా సినిమాలలోకి వస్తాడని, మోక్షజ్ఞ సినిమాలలో నటించడానికి ఆసక్తిగా ఉంటేనే ప్రోత్సహిస్తానని , దీనికి ప్రత్యేకించి ప్లాన్ ఏదీ లేదని, టైమ్ వస్తే అన్నీ సజావుగా సాగుతాయని చెప్పారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న NBK106 మూవీ లో నటిస్తున్నారు. దర్శకుడు బోయపాటి , హీరో బాల కృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా NBK106 రూపొందుతుంది. “ఈ మూవీ కి “మోనార్క్ “టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: