పదేళ్ల ‘వేదం’.. ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు..!

Stylish Star Allu Arjun Thanks Entire Crew Of Vedam On Completing 10 Years Of Movie Release
Stylish Star Allu Arjun Thanks Entire Crew Of Vedam On Completing 10 Years Of Movie Release

క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, మనోజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మల్టీస్టారర్ సినిమా ‘వేదం’. 2010లో వచ్చిన ఈ సినిమా ప్రశంసకుల విమర్శలు సైతం దక్కించుకుంది. కేబుల్ ఆపరేటర్ గా.. మనిషిగా పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని భావించే అల్లు అర్జున్ నటన అటు కామెడీగానే వుంటూ ఆకట్టుకుంటుంది. గొప్పింటి అబ్బాయిలా ఉండటానికి.. కనిపించడానికి అల్లు అర్జున్ పడే తాపత్రయం అటు నవ్విస్తూనే.. ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ఇక వేశ్య వృత్తిలో ఎన్ని ఇబ్బందులున్నాయి…వారి జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది అన్న విషయాలు అనుష్క‌ పాత్ర ద్వారా చూపాడు దర్శకుడు. పాప్ స్టార్ కావాల‌నుకునే యువ‌కుడి పాత్ర‌లో మనోజ్ న‌టించ‌గా, ముస్లిం అయిన పాపానికి టెర్రరిస్ట్‌గా ముద్ర వేయడం, దాన్నుంచి బయటపడి సౌదీ వెళ్లాలనుకునే టైమ్‌లో పోలీసులు అతడిని అరెస్టు చేయడం సినిమాలో ఆస‌క్తిగా చూపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా 2010 జూన్ 4 న రిలీజ్ అవ్వగా ఈ రోజుతో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ గుర్తు చేసుకున్నాడు. ‘వేదం పదేళ్లు పూర్తిచేసుకుంది.. అంద‌మైన ప్ర‌యాణంలో నాతో పాటు క‌లిసి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు. క్రిష్ మీ విజ‌న్‌, ప్యాష‌న్ కు థాంక్స్. అంతేకాదు మ‌నోజ్‌, అనుష్క‌, మ‌నోజ్ భాజ్‌పాయ్‌, ఇత‌ర చిత్ర బృందం అంద‌రికి ధ‌న్య‌వాదాలు. అని బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + six =