జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#NTR30” మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ “KGF చాప్టర్ 1” కన్నడ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుందనే వార్తలు చాలా కాలం గా వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
న్యూక్లియర్ వంటి ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీ కి రేడియేషన్ సూట్ వేసుకోవాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే (మే 20 )రోజున విషెస్ తెలుపుతూ ఎన్టీఆర్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రశంసించారు. ఈ రోజు ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలుపుతూ రేడియేషన్ సూట్ లో కలవడానికి వెయిట్ చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్వీట్ చేసింది. ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ రూపొందనుందని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇన్ డైరెక్ట్ గా తెలిపింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: