తండ్రీ కొడుకులు హీరోలుగా #VIKRAM 60 మూవీ
This Iconic Father and Son Duo To Share Screen Space Together For Vikram 60 Movie
ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకొని నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం "కోబ్రా ", "మహావీర్ కర్ణ ", "పొన్నియిన్ సెల్వన్ " మూవీస్ లోన్ నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ ఇప్పుడు తన 60 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ మూవీ రూపొందనుంది.
సక్సెస్ ఫుల్ "జిగర్తాండ ", "పేట " మూవీస్ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా #VIKRAM 60 మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో మరో హీరోగా విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్నారు. సూపర్ హిట్ అర్జున్ రెడ్డి "తమిళ రీమేక్ "ఆదిత్య వర్మ " మూవీ తో హీరోగా ధృవ్ కోలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆమూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ధృవ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. తండ్రీ కొడుకులు హీరోలుగా రూపొందనున్న #VIKRAM 60 మూవీ కై అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.







