పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. ఇక కరోనా వల్ల ప్యాకప్ చెప్పుకొని ఇక్కడికి వచ్చేసారు. మరి షూటింగ్ కు ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం ఇంకా తెలీదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదని ఇప్పటినే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైటర్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. అసలైన టైటిల్ వేరే ఉందని ఇంతకుముందే తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తామని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఒక అభిమాని.. ఈ సినిమా స్క్రిప్ట్ లో చేంజెస్ జరుగుతున్నాయని.. లొకేషన్ లో చేంజెస్ జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడుగగా.. దానిపై స్పందించిన ఛార్మి.. ఫైటర్ ఎలాంటి చేంజెస్ లేవు. ఇకపై కూడా వుండవు… ఫైటర్ స్క్రిప్ట్ బ్లాక్ బస్టర్ అంతే.. పరిస్థితులు చెక్కబడిన తర్వాత షూట్ మొదలుపెడతాం.. త్వరలోనే ఒరిజినల్ టైటిల్ ప్రకటిస్తాం అని తెలిపింది.
Nothing has been changed n nothing will be changed !! Fighter script is a blockbuster..
shoot will begin only after corona crises settles down ..
we r super duper confident about FIGHTER .. original title announcement soon 💪🏻
Stay tuned 🤩 https://t.co/tNAITYJ3Ro— Charmme Kaur (@Charmmeofficial) June 19, 2020




కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు. మరి ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో… పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























